Rohit Sharma: ఆసీస్ తో మొదటి వన్డేకి రోహిత్ శర్మ దూరం కావటానికి కారణమిదే..!
రోహిత్ శర్మ (Rohit Sharma) కుటుంబ కారణాల వల్ల ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఆడలేకపోతున్నాడు. అతని గైర్హాజరీలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మార్చి 17న ముంబైలో టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు.
- By Gopichand Published Date - 10:10 AM, Thu - 16 March 23

రోహిత్ శర్మ (Rohit Sharma) కుటుంబ కారణాల వల్ల ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో ఆడలేకపోతున్నాడు. అతని గైర్హాజరీలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మార్చి 17న ముంబైలో టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడు. వన్డేల్లో భారత్‌కు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. భారత వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో KL రాహుల్ టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ అతని పేలవమైన ఫామ్ కారణంగా వైస్ కెప్టెన్సీని కోల్పోవలసి వచ్చింది. జట్టు నుండి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో వైస్ కెప్టెన్ ఎవరూ లేరు. అయితే, అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌లో రోహిత్ కొంతసేపు మైదానంలో లేనప్పుడు ఛెతేశ్వర్ పుజారా జట్టు బాధ్యతలు స్వీకరించాడు.
Also Read: RCB beat UP Warriorz: హమ్మయ్య.. తొలి విజయం సాధించిన బెంగళూరు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023ని ముగించిన టీమిండియా రేపటి నుంచి వన్డే సిరీస్‌లో పాల్గొనబోతోంది. మార్చి 17న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కి దూరంగా ఉండబోతున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ప్రస్తుత తన భార్య రితికా సాగ్జే సోదరుడు కృనాల్ వివాహ వేడుకల్లో బిజీగా ఉన్నాడు. మార్చి 16, 17 తేదీల్లో కృనాల్ పెళ్లి జరగనుంది. ఇది ముగిసిన తర్వాత టీమిండియాతో కలుస్తాడు రోహిత్ శర్మ. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2-1తో కైవసం చేసుకుంది.
ఈ సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించగానే.. కుటుంబ కారణాల వల్ల రోహిత్ ముంబై వన్డేకు అందుబాటులో లేడని చెప్పుకొచ్చారు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ ఎందుకు మైదానంలోకి దిగడు అనేది ఇప్పుడు తేలిపోయింది. భార్య రితికా సోదరుడు వివాహానికి హాజరవుతున్నందున రోహిత్ మొదటి వన్డేలో ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. మార్చి 19న విశాఖపట్నంలో జరిగే రెండో వన్డేలో రోహిత్ భారత జట్టులో చేరనున్నాడు. సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ మార్చి 22న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.

Related News

IND vs AUS 3rd ODI: చివరి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.