RCB beat UP Warriorz: హమ్మయ్య.. తొలి విజయం సాధించిన బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. టోర్నీలో గురువారం (మార్చి 15) జరిగిన 13వ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ (UP Warriorz)ను ఓడించింది.
- By Gopichand Published Date - 07:45 AM, Thu - 16 March 23

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. టోర్నీలో గురువారం (మార్చి 15) జరిగిన 13వ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ (UP Warriorz)ను ఓడించింది. స్టార్ ప్లేయర్లతో అలరించిన స్మృతి మంధాన జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఐదు మ్యాచ్‌ల్లో యూపీకిది మూడో ఓటమి. ఈ టోర్నీలో RCB మొదటి ఐదు మ్యాచ్‌లలో వరుస ఓటములను చవిచూసిన తర్వాత ఈ మొదటి విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సిబి టాస్ గెలిచి యూపీని మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మొదటి నుండి యూపీపై బెంగళూరు ఆధిపత్యం చెలాయించింది. బెంగళూరు బౌలర్లు యూపీ జట్టుకి చెందిన ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను కేవలం 31 పరుగులకే పెవిలియన్‌కు పంపారు. ఆ తర్వాత యూపీ తమ ఇన్నింగ్స్‌ను ఎలాగోలా ముందుకు తీసుకెళ్లినా బెంగళూరు బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
Also Read: Kohli Style: డాన్స్ తో అదరగొట్టిన కోహ్లీ
బెంగళూరు తరుపున ఇన్నింగ్స్ ప్రారంభించిన సోఫీ డివైన్.. తొలి ఓవర్లో 14 పరుగులు చేసి వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత స్మృతి మంధాన కూడా పరుగులేమీ చేయకుండానే మరుసటి ఓవర్‌లో దీప్తి శర్మ బౌలింగ్‌లో అవుటైంది. కొంత సమయం తర్వాత ఆలిస్ పెర్రీ, హీథర్ నైట్ కూడా ఔట్ అయ్యి తిరిగి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత ఈ మ్యాచ్‌లో RCB ఓడిపోతుందేమో అనిపించింది.
ఆపై కనికా అహుజా బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చింది.30 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 46 పరుగులు చేసి జట్టును విజయపథంలోకి తీసుకెళ్లింది. రిషా ఘోష్ కనికాకు చాలా సపోర్ట్ చేసింది. రిచా 32 బంతుల్లో 31 పరుగులు చేసి ఒక ఎండ్‌ను సురక్షితంగా ఉంచింది. ఈ విధంగా మహిళల ప్రీమియర్ లీగ్‌లో RCB తొలి విజయాన్ని అందుకుంది. యూపీ తరఫున దీప్తి శర్మ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, ఆమెతో పాటు గ్రేస్ హారిస్, సోఫీ ఎక్లెస్టన్, దేవిక వైద్య చెరో వికెట్ తీశారు.
మరోవైపు, ఆర్‌సిబి తరఫున అలిస్ పెర్రీ అత్యుత్తమ బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. మరోవైపు సోఫీ డివైన్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీయగా, ఆశా శోబన కూడా 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. వీరితో పాటు మెగానా సుచిత్, శ్రేయాంక పాటిల్ కూడా చెరో వికెట్ తీశారు.

Related News

Royal Challengers Bangalore: పదునెక్కిన బెంగళూరు బౌలింగ్.. హోంగ్రౌండ్ తోనే అసలు సమస్య
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. స్టార్ ప్లేయర్స్ ఉన్నా పలుసార్లు అంచనాలు అందుకోలేక చతికిలపడుతూనే ఉంది.