Hardik Pandya: ఎలిమినేటర్ మ్యాచ్.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ చూశారా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌ను గెలిచి ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
- By Gopichand Published Date - 07:32 PM, Fri - 30 May 25

Hardik Pandya: ఎలిమినేటర్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతుంది. అయితే మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రత్యేక శైలిలో కనిపిస్తున్నాడు. హార్దిక్ టీ20 వరల్డ్ కప్ 2024 శైలిలో ఐపీఎల్ ప్లేఆఫ్‌లో కనిపించనున్నాడు. హార్దిక్ ఈ కొత్త లుక్‌ను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా పేజీలో కూడా షేర్ చేశారు. అంతేకాకుండా మ్యాచ్ టాస్ సమయంలో కూడా కొత్త లుక్‌లోనే కనిపించాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
హార్దిక్ పాండ్యా కొత్త లుక్
హార్దిక్ పాండ్యా క్లీన్ షేవ్ లుక్ అతని అభిమానులకు చాలా నచ్చింది. టీ20 వరల్డ్ కప్‌లో హార్దిక్ అద్భుతంగా ప్రదర్శన చేశాడు. టీమ్ ఇండియా ఆ టోర్నమెంట్‌లో విజయం సాధించింది. ఈ రోజు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ రోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టు రెండవ ప్లేఆఫ్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడుతుంది.
Also Read: Pawan Kalyan : డబ్బింగ్ చెప్పడంలో వీరమల్లు సరికొత్త రికార్డు
ముంబై-గుజరాత్ మ్యాచ్ డూ ఆర్ డై
ముంబై- గుజరాత్ మధ్య ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఐపీఎల్ 2025 నుండి తప్పుకుంటుంది. గెలిచిన జట్టు ట్రోఫీకి ఒక అడుగు దగ్గరవుతుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత గెలిచిన జట్టు రెండవ క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది.
ఆర్‌సీబీ డైరెక్ట్ ఫైనల్‌కు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌ను గెలిచి ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లో స్థానం ఖాయం చేసుకుంది. రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ జూన్ 1న జరగనుంది. ఈ మ్యాచ్‌ను గెలిచిన జట్టు జూన్ 3న ఆర్‌సీబీతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.