India vs Bangladesh: భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.!
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఇవాళ కీలక మ్యాచ్ ఆడబోతోంది.
- Author : Gopichand
Date : 02-11-2022 - 12:11 IST
Published By : Hashtagu Telugu Desk
T20 వరల్డ్ కప్ లో భారత్ ఇవాళ కీలక మ్యాచ్ ఆడబోతోంది. సఫారీ జట్టు చేతిలో ఓటమితో నిరాశ పరిచిన రోహిత్ సేన సెమీస్ బెర్త్ లక్ష్యంగా బంగ్లాదేశ్ తో తలపడనుంది. కాగా ఈ కీలక మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ వెల్లడించింది. వర్షం ఆటంకం ఉందనడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో టీమిండియా అభిమానులకు ఆడిలైడ్ నుంచి తాజాగా ఓ గుడ్ న్యూస్ అందింది. ఇవాళ ఉదయం నుంచి ఆడిలైడ్‌లో వర్షం పడలేదు. ఈ రోజు వాతావరణం గణనీయంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ బోరియా మజుందార్ ట్విటర్‌లో వెల్లడించారు. భారత్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఓడిస్తామంటూ బంగ్లాదేశ్ కేప్టెన్ షకీబుల్ హసన్ ఇప్పటికే మాటల యుద్ధానికి తెర తీసిన నేపథ్యంలో- రోహిత్ సేన ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే అడిలైడ్ ఫ్లాటెడ్ పిచ్. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు సహకరిస్తుంది. మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు, మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. మొత్తం మీద బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా.