Gautam Gambhir: ఇక కలిసి పని చేద్దాం…
టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత జట్టును నడిపించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. దానికి గంభీర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. కానీ ఇక్కడ గంభీర్ ఓ షరతు బీసీసీఐ ముందు ఉంచినట్లు తెలుస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 17-06-2024 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
Gautam Gambhir: టీ-20 ప్రపంచకప్ ముగియడంతో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో టీమిండియాకు తదుపరి కోచ్ కోసం బీసీసీఐ వేట ప్రారంభించింది. ఇందుకోసం మూడు వేలకు పైగా అప్లికేషన్స్ రావడం ఆశ్చర్యపరిచింది. విశేషమేంటంటే ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా పేర్లతో కూడా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే టీమిండియాకు హెడ్ కోచ్ ఎవరనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు.
టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత జట్టును నడిపించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. దానికి గంభీర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. కానీ ఇక్కడ గంభీర్ ఓ షరతు బీసీసీఐ ముందు ఉంచినట్లు తెలుస్తుంది. వాస్తవానికి రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. గంభీర్‌ను ఈ పదవిని చేపట్టేందుకు బోర్డు ఒప్పించింది. అయితే గంభీర్ బీసీసీఐ ముందు ఒక షరతు పెట్టాడని, దానికి అంగీకరించిన తర్వాతే అతను ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నట్లు సమాచారం.
సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే హక్కు తనకు కల్పిస్తే ఆ పదవిని స్వీకరిస్తానని గంభీర్ బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తుంది. అయితే గంభీర్ షరతుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తానికి ప్రధాన కోచ్‌గా గంభీర్ నియామకాన్ని ఈ నెలాఖరులో బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ ఏటా 10 కోట్లు వేతనంగా చెల్లిస్తోంది. మరి గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపడితే అతని జీతం భారీగా పెరిగే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం గంభీర్ కు బీసీసీఐ ఏటా రూ.10 నుంచి 12 కోట్ల వరకు వేతనం ఇవ్వనున్నదట.
Also Read: T20 World Cup: సూపర్ 8 మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉందా ? వర్షంతో మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే