IPL : ఆర్సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్రచారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్
- Author : Prasad
Date : 31-05-2026 - 8:52 IST
Published By : Hashtagu Telugu Desk
నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య ఈ మ్యాచ్ సాగనుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం అంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఖండించింది. క్రికెట్ అభిమానులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నామన్న సందేశాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా ప్రచారం నేపథ్యంలో BMRCL పత్రికాప్రకటన చేసింది. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు ఈ వదంతులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండవ సీజన్‌కు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ రోజు (మే 31)న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. కర్ణాటక వ్యాప్తంగా ఉన్న ఆర్సీబీ మద్దతుదారులలో జోష్ నిపింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులను మెట్రో సర్వీసులలో ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తారని సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి. దీంతో మెట్రో ప్రయాణికలు, అభిమానుల మధ్య కాస్త గందరగోళానికి దారితీసింది. ఈ ఆరోపణలపై స్పందిస్తూ తాము అటువంటి పథకాన్ని ఏదీ ప్రకటించలేదని, అలాగే ఆర్సీబీ మద్దతుదారులకు ఉచిత మెట్రో ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ఏ వ్యక్తికి గానీ, సంస్థకు గానీ అధికారం ఇవ్వలేదని తెలిపింది. మెట్రో సర్వీసులలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టిక్కెట్లను కొనుగోలు చేయాలని లేదా స్మార్ట్ కార్డ్‌లు మరియు క్యూఆర్ ఆధారిత టిక్కెట్లను ఉపయోగించాలని మెట్రో కార్పొరేషన్ తెలిపింది. ప్రస్తుత ఛార్జీల విధానంలో ఎలాంటి మార్పు లేదని..ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఎటువంటి ప్రత్యేక రాయితీలు ప్రవేశపెట్టబడలేదని స్పష్టత ఇచ్చింది