HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Ntr Jayanti Mini Mahanadu Celebrations In Los Angeles

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Author : Prasad Date : 31-05-2026 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
NRI TDP
NRI TDP

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర, నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహ‌న్ నాయుడు జూమ్ ద్వారా హాజరయ్యారు. సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు పాల్గొని ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. అన్న ఎన్టీఆర్ గారి జయంతిని పురస్క రించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని.. వారి కృషివల్ల గూగుల్, ఆర్సెలర్ మిట్టల్ వంటి భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును జులైలో ప్రధాని నరేంద్ర మోడీజీ చేతులమీదుగా ప్రారంభించబోతున్నామ‌ని.. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 7ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని.. విజయవాడ నుంచి సింగపూర్ కు ఇప్పటికే డైరక్ట్ సర్వీసులు ప్రారంభించామ‌ని రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. త్వరలోనే మలేషియా, హాంగ్ కాండ్, గల్ఫ్ దేశాలకు కూడా నేరుగా సర్వీసులు ప్రారంభిస్తామ‌ని.. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంలో ఎన్ఆర్ఐ ల పాత్ర మరువలేనిద‌ని కొనియాడారు. ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబునాయుడు, యువనేత లోకేష్ చేస్తున్న కృషికి ప్రవాసాంధ్రుల సహకారం అవసరమ‌న్నారు. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలకు ఎటువంటి సాయం కావాల్సి వచ్చినా తాను వారధిగా ఉంటానని చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • los angeles
  • mahanadu
  • NRI TDP
  • Sr Ntr Jayanthi
  • tdp

Related News

Complaint filed against actor Prakash Raj at the police station.

Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విష్ణువర్ధన

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

Latest News

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

  • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd