Chief Selector: చేతన్ శర్మ రాజీనామా.. తదుపరి చీఫ్ సెలెక్టర్ ఇతనేనా..?
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటికే సెలెక్టర్‌గా ఉన్న శివ్ సుందర్ దాస్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- Author : Gopichand
Date : 18-02-2023 - 7:55 IST
Published By : Hashtagu Telugu Desk
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో ఇప్పటికే సెలెక్టర్‌గా ఉన్న శివ్ సుందర్ దాస్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చేతన్ శర్మపై ద్రావిడ్, రోహిత్, హార్దిక్ పాండ్యాలకు నమ్మకం పోయిందని, అందుకే అతను రాజీనామా చేసి ఉంటాడని పలువురు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ శుక్రవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాత ఇప్పుడు ఊహాగానాలు జోరందుకున్నాయి. జాతీయ సెలక్షన్ కమిటీ తాత్కాలిక ఛైర్మన్‌గా భారత మాజీ ఓపెనర్ శివ సుందర్ దాస్‌ను నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. చేతన్ శర్మ ఒక స్టింగ్ ఆపరేషన్‌లో అనేక విషయాలు వెల్లడించాడు. ఆ తర్వాత అతను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
భువనేశ్వర్ ఒరిస్సాలో జన్మించిన 45 ఏళ్ల శివ సుందర్ దాస్ భారత మాజీ ఓపెనర్. దాస్ టీమ్ ఇండియా తరఫున 23 టెస్టులు, 4 వన్డేలు ఆడాడు. అతను 10 నవంబర్ 2000న బంగ్లాదేశ్‌తో ఢాకాలో తన టెస్టు అరంగేట్రం చేశాడు. 2001లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఒరిస్సా నుంచి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. అతను కొంతకాలం పాటు భారతదేశం మొదటి ఎంపిక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. అతను సచిన్ టెండూల్కర్‌తో కలిసి చాలాసార్లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అతను మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా ఉన్నాడు.
Also Read: Australia All Out: భారత్ బౌలర్లు విజృంభణ.. 263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!
దాస్ తన టెస్టు కెరీర్‌లో రెండు సెంచరీలు సాధించాడు. విశేషమేమిటంటే అతని రెండు సెంచరీలు నాగ్‌పూర్‌లో జింబాబ్వేపై వచ్చాయి. అయితే, 2002లో వెస్టిండీస్‌లో భారత పర్యటనలో అతని ప్రదర్శన నిరాశపరిచింది. అయినప్పటికీ, అతను 2006-07లో దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన పునరాగమనం చేసాడు. అతను తొలి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఆ కాలంలో ఒరిస్సా క్రికెట్ అసోసియేషన్ అతనిని 30,000 రూపాయల నగదు బహుమతితో సత్కరించింది.
2010-11లో అతను ఒరిస్సా కెప్టెన్సీ నుండి తొలగించబడడమే కాకుండా ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం ఐదు పరుగులు చేసిన తర్వాత ఒరిస్సా జట్టు నుండి కూడా తొలగించబడ్డాడు. దాస్ తన కెరీర్‌లో 23 టెస్టులు ఆడాడు. భవిష్యత్తులో ఆటగాళ్లు, అధికారులు మీడియాతో మాట్లాడకుండా బీసీసీఐ నిషేధం విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. “చేతన్ తన రాజీనామాను బీసీసీఐ సెక్రటరీ జే షాకు సమర్పించారని, అతని రాజీనామాను ఆమోదించారు. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. రాజీనామా చేయమని అడగలేదు. బెంగాల్, సౌరాష్ట్ర మధ్య జరిగే రంజీ ట్రోఫీ ఫైనల్ కోసం ఇతర సెలక్షన్ కమిటీ సభ్యులతో పాటు చేతన్ కోల్‌కతాలో ఉన్నారు. ఇరానీ కప్ జట్టును ఎంపిక చేసేందుకు అతను అక్కడికి వచ్చాడు. అయితే, తన రాజీనామాను ఆమోదించిన తర్వాత, చేతన్ ఇక్కడి విమానాశ్రయంలో వేచి ఉన్న మీడియాను తప్పించుకొని ఢిల్లీకి వెళ్లిపోయారు.