HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Heart Attack After Just 8 Minutes Of Anger

కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2026 - 12:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heart Attack Anger
Heart Attack Anger
Heart Attack  ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8 నిమిషాల పాటు గుర్తుచేసుకోమని చెప్పారు. ఆ సమయంలో వారిపై జరిపిన అధ్యయనం ద్వారా వెలుగు చూసిన ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రభావం ఎలా ఉంటుందంటే..
కోపంగా ఉన్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచించే (విచ్చుకునే) సామర్థ్యం దాదాపు సగానికి పడిపోతుంది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు 8 నిమిషాల పాటు కోపంతో ఉన్నప్పటికీ రక్తనాళాలపై దాని ప్రభావం మరో 40 నిమిషాల పాటు ఉందని పరిశోధకులు చెప్పారు. బాధ లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు రక్తనాళాలపై కోపం చూపించినంత తీవ్రమైన ప్రభావాన్ని చూపలేదని వివరించారు.

రక్తనాళాలు బిగుసుకుపోవడం..

కోపం వల్ల రక్తనాళాలు బిగుసుకుపోతాయని పరిశోధకులు తెలిపారు. దీంతో రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మరింత కష్టపడాల్సి వస్తుందని అన్నారు. తరచుగా ఇలా జరగడం వల్ల అధిక రక్తపోటు, ధమనులు దెబ్బతినడం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెపోటు, పక్షవాతం తదితర సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు.

గుండెను దెబ్బతీసేదిలా..

కోపం వచ్చినప్పుడు శరీరంలో ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ స్పందన మొదలవుతుంది. దీనివల్ల అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తనాళాలను గట్టిపడేలా చేసి, రక్తపోటును మరియు హృదయ స్పందన రేటును పెంచుతాయి. ముంబైలోని సైఫీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నిమిత్ సి షా దీనిపై స్పందిస్తూ.. “ఒక్కసారి కోప్పడితే శాశ్వత నష్టం జరగకపోవచ్చు, కానీ తరచుగా కోపగించుకోవడం వల్ల రక్తనాళాలు క్రమంగా దెబ్బతింటాయి, ఇది భవిష్యత్తులో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది” అని హెచ్చరించారు.

జీవనశైలి వల్ల ముప్పు..

నేటి ఆధునిక కాలంలో సరైన నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఇప్పటికే గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంది. దీనికి తోడు ‘అదుపులేని కోపం’ తోడైతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆరోగ్యంగా ఉండే యువత కూడా తరచుగా కోపగించుకోవడం వల్ల తమ గుండె ఆరోగ్యాన్ని రిస్క్‌లో పడేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anger
  • Blood vessels
  • Cardiac problems
  • cardiovascular health
  • Dr Nimit Shah
  • Fight or flight response
  • health tips
  • heart attack
  • high blood pressure
  • Life Style
  • stress hormones
  • Stress hormones decrease
  • stroke

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • హ్యుందాయ్ వెన్యూ సరికొత్త మైలురాయి!

    • జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. బెంగళూరు ఈవెంట్‌లో ఏం జరిగింది?

    • ఐపీఎల్ 2026 షెడ్యూల్‌.. కీలక విషయాలివే!

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

    Trending News

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd