Anupama Birthday : అనుపమ కొత్త మూవీ ప్రకటన
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 'ప్రేమమ్' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి 'కార్తికేయ 2', 'రాక్షసుడు' వంటి హిట్స్ అందుకున్న అనుపమ
- Author : Sudheer
Date : 18-02-2026 - 1:18 IST
Published By : Hashtagu Telugu Desk
Anupama : కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ ‘టిల్లు స్క్వేర్’ బ్యూటీ, ఇప్పుడు ఒక విలక్షణమైన సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనుపమ ప్రధాన పాత్రలో, ఆర్జే షాన్ దర్శకత్వంలో ఒక కొత్త ఫీచర్ ఫిల్మ్ పట్టాలెక్కబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ విజయాన్ని అందుకుంది. ఆ కెమిస్ట్రీ మరియు మేకింగ్ స్టైల్ వర్కవుట్ కావడంతో, ఇప్పుడు అదే జోడీ బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. ఎస్ కే గీ ఎంటర్‌టైన్మెంట్ మరియు బెంచ్‌మార్క్ స్టోరీటెల్లర్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందనుండటం విశేషం.
ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నిర్మాత ప్రేరణ అరోరాతో పాటు శివిన్ నారంగ్, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేరణ అరోరా గతంలో ‘రుస్తుం’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి జాతీయ అవార్డులు మరియు కమర్షియల్ హిట్లు అందుకున్న చిత్రాలను నిర్మించారు. ఒక అగ్ర స్టూడియో భాగస్వామ్యంతో అత్యున్నత సాంకేతిక విలువల మధ్య ఈ సినిమా రూపొందనుంది. ఇటీవల ‘జటాధర’ వంటి ప్రాజెక్టులతో వార్తల్లో నిలిచిన ఈ నిర్మాణ సంస్థలు, అనుపమ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ పాన్ సౌత్ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నాయి.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ‘ప్రేమమ్’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ‘కార్తికేయ 2’, ‘రాక్షసుడు’ వంటి హిట్స్ అందుకున్న అనుపమ, ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న నటిగా కొనసాగుతోంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఆమెకు, ఈ సైకాలజికల్ థ్రిల్లర్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.