HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tension At Andhra University

Andhra University : ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత..రంగంలోకి పోలీసులు

ఏబీవీపీ శ్రేణులు వీసీ ఆఫీసు ముట్టడికి యత్నిస్తున్న సమయంలోనే, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కూడా అక్కడికి చేరుకుని ప్రతినినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, అది కాస్తా తోపులాటకు దారితీసింది.

  • Author : Sudheer Date : 18-02-2026 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra University
Andhra University

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) బుధువారం రణరంగంగా మారింది. గత రెండు రోజులుగా విద్యార్థి సంఘాల మధ్య నలుగుతున్న వివాదం ముదిరి, చివరకు ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లో నిన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నిర్వహించిన ‘పథ సంచాలన్’ (మార్చ్‌)ను ఎస్‌ఎఫ్‌ఐ (SFI) కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ వివాదం మొదలైంది. విద్యా సంస్థల్లో మతపరమైన లేదా రాజకీయ కవాతులు నిర్వహించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ వాదించగా, దీనిని నిరసిస్తూ ఏబీవీపీ (ABVP) నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎస్‌ఎఫ్‌ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వైస్ ఛాన్సలర్ (VC) కార్యాలయం వైపు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

ఏబీవీపీ శ్రేణులు వీసీ ఆఫీసు ముట్టడికి యత్నిస్తున్న సమయంలోనే, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కూడా అక్కడికి చేరుకుని ప్రతినినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, అది కాస్తా తోపులాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగే పరిస్థితి రావడంతో యూనివర్సిటీ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వర్సిటీ భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపు చేయలేకపోయారు, దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు భారీగా క్యాంపస్‌కు చేరుకుని ఘర్షణ పడుతున్న విద్యార్థులను చెల్లాచెదురు చేశారు. పరిస్థితి మరీ విషమించకుండా ఉండేందుకు యూనివర్సిటీ ప్రధాన ద్వారాలకు పోలీసులు తాళాలు వేశారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు లేదా ఇతర రాజకీయ శ్రేణులు రాకుండా కఠిన ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఏయూ పరిసరాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది. విద్యార్థి సంఘాల నేతలతో పోలీసులు చర్చలు జరుపుతూ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra university
  • Andhra University SFI
  • ఆంధ్ర యూనివర్సిటీ

Related News

    Latest News

    • Andhra University : ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత..రంగంలోకి పోలీసులు

    • Anupama Birthday : అనుపమ కొత్త మూవీ ప్రకటన

    • Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

    • కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

    • Silver Price Today : వెండి కొనుగోలు దారులకు శుభవార్త..ఏకంగా రూ.5వేలు తగ్గిన సిల్వర్ రేటు

    Trending News

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd