Rohit Sharma: ఓపెనర్ గానూ ప్లాప్.. రీటైర్మెంట్ ఇవ్వాల్సిందే అంటున్న ఫ్యాన్స్
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అందరూ అనుకున్నారు. కానీ, అతను పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు ప్రత్యర్థి కెప్టెన్ పాట్ కమిన్స్‌కు క్యాచయ్యాడు. ఫలితంగా, రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
- By Kode Mohan Sai Published Date - 01:12 PM, Fri - 27 December 24

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ -ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 భారీ పరుగులు రాబట్టింది. స్మిత్ సెంచరీతో అదరగొట్టగా, టాపార్డర్ బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఛేదనలో భారత్ మరోసారి తడబడింది. జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అంతా భావించారు. కానీ అతను పుల్ షాట్ ఆడుతూ ప్రత్యర్థి కెప్టెన్ పాట్ కమిన్స్‌కు బలి అయ్యాడు. రోహిత్ కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతను నిరాశతో పెవిలియన్‌కు చేరుకోవలసి వచ్చింది. దీని తరువాత భారత అభిమానులు సోషల్ మీడియాలో రోహిత్ ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. రోహిత్ టెస్ట్ నుండి రిటైర్ అయితే గౌరవంగా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి తన ఫేవరేట్ పుల్ షాట్ ని రోహిత్ ఇప్పుడు ఆడలేకపోవడం ఫ్యాన్స్ ను బాధిస్తుంది.ఒకప్పుడు పుల్ షాట్ తో అందర్నీ ఉర్రుతలూగించిన హిట్ మ్యాన్ ఇప్పుడు అదే షాట్ ను ఆడటానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు.
Rohit Sharma in Last 14 Innings
6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3Runs : 155
Average : 11Please selflessly retire Vadapav please🙏😭#INDvsAUS #INDvAUS #rohit pic.twitter.com/WWzNFtmCka
— BEAST (@BEASTKLR) December 27, 2024
బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి పాట్ కమిన్స్ బౌలింగ్ లో స్కాట్ బోలాండ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నిస్తుండగా సులువుగా క్యాచ్ ఇచ్చాడు. ఈ సమయంలో రోహిత్ 5 బంతులు ఎదుర్కొని 3 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్‌లో రోహిత్ కమిన్స్ బౌలింగ్ లో 199 బంతులు అడగా అందులో అతను 7 సార్లు అవుట్ అయ్యాడు. ఈ సమయంలో రోహిత్ 127 పరుగులు చేశాడు.
ఈ సిరీస్‌లో ఓపెనర్ గా అద్భుతంగా రాణిస్తున్న కేఎల్ రాహుల్‌కు మెల్‌బోర్న్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు కెప్టెన్ రోహిత్ అవకాశం ఇవ్వలేదు. రోహిత్ ఓపెనింగ్ కారణంగా కేఎల్ రాహుల్ 3వ నంబర్‌లో బ్యాటింగ్‌కు రావలసి వచ్చింది. ఇక రోహిత్ గత 14 టెస్టు ఇన్నింగ్స్‌ల గురించి మాట్లాడితే.. రోహిత్ శర్మ 6,5, 23,8, 2, 52, 0, 9, 18, 11,3,6,10,3 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సమయంలో అతను ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ చేశాడు.