Harry Brook Records: ఇంగ్లాండ్ కెప్టెన్లందరినీ వెనక్కి నెట్టిన హ్యారీ బ్రూక్
Harry Brook Records: హ్యారీ బ్రూక్ 94 బంతుల్లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకుంది. బ్రూక్ ఈ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 25 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు.
- By Praveen Aluthuru Published Date - 07:11 PM, Wed - 25 September 24

Harry Brook Records: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్‌లో జోస్ బట్లర్ లేకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్సీని యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ (harry brook)కు అప్పగించారు. తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే మూడో వన్డేలో కెప్టెన్ బ్రూక్ సెంచరీతో ఇంగ్లండ్‌ను విజయపథంలో నడిపించడమే కాకుండా కెప్టెన్‌గా తన పేరిట ఓ అద్వితీయ రికార్డును సృష్టించాడు. ఈ విషయంలో ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, జో రూట్ సహా ఇంగ్లాండ్ కెప్టెన్లందరినీ బ్రూక్ అధిగమించాడు.
హ్యారీ బ్రూక్ 94 బంతుల్లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ఆధారంగా ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కాపాడుకుంది. బ్రూక్ ఈ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 25 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో మాజీ కెప్టెన్లందరినీ వెనకేసుకొచ్చాడు. బ్రూక్‌కి ఇదే తొలి వన్డే సెంచరీ కావడం విశేషం. 2023 జనవరిలో తన వన్డే కెరీర్‌ను ప్రారంభించిన బ్రూక్ ఇప్పటివరకు 18 వన్డేలు ఆడాడు. 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 560 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని సగటు 35 మరియు స్ట్రైక్ రేట్ 99.47గా ఉంది. బ్రూక్ ఇంగ్లాండ్ తరుపున మూడు ఫార్మాట్లలో ఆడతాడు. అయితే బ్రూక్ ఇలానే ఆడితే బట్లర్ తర్వాత ఇంగ్లండ్ జట్టుకు పర్మినెంట్ కెప్టెన్ అయ్యే అవకాశముంది.
గత మ్యాచ్ లో ఇంగ్లండ్ (england) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా (australia) 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 82 బంతుల్లో 60 పరుగులు, అలెక్స్ కారీ 65 బంతుల్లో అజేయంగా 77 పరుగులు, కెమెరాన్ గ్రీన్ 42 పరుగులు, ఆరోన్ హార్డీ 44 పరుగులు, గ్లెన్ మాక్స్‌వెల్ 30 పరుగులు చేశారు. 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు బ్యాడ్ ఆరంభం లభించడంతో 11 పరుగుల వద్ద ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. విల్ జాక్వెస్ మరియు హ్యారీ బ్రూక్ మూడో వికెట్‌కు 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టును తిరిగి సేఫ్ జోన్లోకి తీసుకువచ్చారు. జాక్వెస్ 82 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. బ్రూక్ లియామ్ లివింగ్‌స్టన్ 33 నాటౌట్‌తో కలిసి 5వ వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లండ్ స్కోరు 37.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగుల వద్ద ఉండగా, విజయానికి 74 బంతుల్లో 51 పరుగులు చేయాల్సి ఉండగా వర్షం కురిసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూడా వర్షం కురవకపోవడంతో డిఎల్‌ఎస్ నిబంధనల ప్రకారం ఇంగ్లండ్‌ను 46 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు.
Also Read: IND vs BAN 2nd Test: కోహ్లీని ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు