HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Ind Vs Ban Kanpur Test Virat Kohli Just 35 Runs Short Of Surpassing Sachin Tendulkars Record

IND vs BAN 2nd Test: కోహ్లీని ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు

IND vs BAN 2nd Test: అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ 26,967 పరుగులు చేశాడు. తదుపరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 33 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ మొత్తం మూడు ఫార్మాట్లతో కలిపి 593 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

  • By Praveen Aluthuru Published Date - 07:03 PM, Wed - 25 September 24
  • daily-hunt
Kohli Test Records
Kohli Test Records

IND vs BAN 2nd Test: చెన్నై టెస్టులో విరాట్ కోహ్లి భారీ స్కోర్ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో కోహ్లీ ఖాతాలో చేరాల్సిన రెండు రికార్డుల్ని కోల్పోయాడు. అయితే 27 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో కోహ్లి ఈ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. కాన్పూర్ టెస్టులో విరాట్ కోహ్లీ తన పేరిట రెండు భారీ రికార్డులను సృష్టించేందుకు సిద్దమవుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి (virat kohli) 26,967 పరుగులు చేశాడు. తదుపరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 33 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ మొత్తం మూడు ఫార్మాట్లతో కలిపి 593 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. సచిన్‌తో పాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర 27,000కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించారు. కాన్పూర్ టెస్టు (kanpur test)లో విరాట్ కోహ్లి 129 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్‌లో 9,000 పరుగులు పూర్తి చేస్తాడు. సచిన్, ద్రవిడ్, గవాస్కర్ తర్వాత టెస్టుల్లో 9,000 పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. అయితే రికార్డులు సృష్టించడం, ఉన్న రికార్డుల్ని బద్దలు కొట్టడం కింగ్ కు కొత్తేమి కాదు.

రెండో టెస్టులో మిగిలిన ఆ రెండు రికార్డుల్ని కూడా బద్దలు కొట్టడం ఖాయం. 35 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు 114 టెస్టుల్లో 29 సెంచరీలతో 8871 పరుగులు చేశాడు. 295 వన్డేల్లో 50 సెంచరీలతో 13906 పరుగులు, 125 టి20లో 1 సెంచరీ, 38 హాఫ్ సెంచరీలతో 4188 పరుగులు చేశాడు. విరాట్ తాజాగా టీ20 నుంచి రిటైర్ అయ్యాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ ఫార్మేట్ కి విరాట్ రిటైర్ కావడానికి చాలా సమయం ఉంది. కాబట్టి అతని ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరడం ఖాయం.

Also Read: 2025 Champions Trophy: బాబర్ కే జై కొడుతున్నపీసీబీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 27000 runds
  • 2nd test
  • 35 runs
  • IND vs BAN
  • Kanpur Test
  • kohli test records
  • Tendulkar's Record
  • virat kohli

Related News

Cricketers Retired

Cricketers Retired: 2025లో ఇప్ప‌టివ‌రకు 19 మంది స్టార్ క్రికెట‌ర్లు రిటైర్మెంట్‌!

ఈ సంవత్సరంలో ODI ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న ముగ్గురు క్రికెటర్లు ఆస్ట్రేలియాకు చెందినవారు. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్ ODI క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు.

  • Fitness Test

    Fitness Test: కేఎల్ రాహుల్ సహా కొంతమంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై సస్పెన్స్?!

  • Virat Kohli

    Virat Kohli: లండన్‌లో విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ టెస్ట్!

  • AB de Villiers

    AB de Villiers: విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్!

Latest News

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

  • Luxury Cars: సెప్టెంబర్ 22 త‌ర్వాత ఎలాంటి కార్లు కొనాలి?

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd