Women T20Is: భారత్-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ..!
మరోవైపు భారత్-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య టీ20 (Women T20Is) సిరీస్‌ను ప్రకటించారు.
- Author : Gopichand
Date : 02-12-2023 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
Women T20Is: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో,భారత్ రెండు ప్రారంభ మ్యాచ్‌లను గెలుచుకుంది. దీని తర్వాత మూడవ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. అయితే భారత్ మళ్లీ నాల్గవ మ్యాచ్‌లో గెలిచి 3-1 ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు భారత్-ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య టీ20 (Women T20Is) సిరీస్‌ను ప్రకటించారు.
డిసెంబర్ 6న తొలి మ్యాచ్ జరగనుంది
భారత మహిళల క్రికెట్ జట్టు- ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 6న జరగనుంది. ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 9న జరగనుండగా, మూడో మ్యాచ్ డిసెంబర్ 10న జరగనుంది.
Also Read: Telangana Election Result : తెలంగాణ ఎన్నికల రిజల్ట్ ఫై భారీగా బెట్టింగ్ లు
టెస్ట్ మ్యాచ్ కూడా
టీ20 మ్యాచ్‌లతో పాటు భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 17 మధ్య జరగాల్సి ఉంది. దీంతో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో కూడా టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 24 మధ్య జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
టీ20కి టీం ఇండియా జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ సింగ్ కశ్యక్, రెనుకా ఇషాక్‌ప్, సయికా ఇషాక్ , టిటాస్ సాధు, పూజా వస్త్రాకర్, కనికా అహుజా, మిన్ను మణి.
టెస్ట్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), స్మృతి మంధాన (విసి), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (డబ్ల్యుకె), రిచా ఘోష్ (డబ్ల్యుకె), స్నేహ రాణా, శుభా సతీష్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధు, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్.