MS Dhoni vs Virat Kohli: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా..?
భారత క్రికెట్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (MS Dhoni vs Virat Kohli) ఉన్నారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఆస్తుల గురించి మీకు తెలుసా?
- By Gopichand Published Date - 12:08 PM, Fri - 22 March 24

MS Dhoni vs Virat Kohli: భారత క్రికెట్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (MS Dhoni vs Virat Kohli) ఉన్నారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఆస్తుల గురించి మీకు తెలుసా? మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ ద్వారా రూ.12 కోట్లు సంపాదించాడు. ఇది కాకుండా అతని పెట్టుబడులు, సోషల్ మీడియా ఫీజులు, సొంత బ్రాండ్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో సహా అతని మొత్తం సంపద రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ. కాగా, విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే అతని ఐపీఎల్ జీతం రూ.15 కోట్లు.
విరాట్ కోహ్లీ నికర విలువ ఎంత?
ఐపీఎల్ జీతం కాకుండా సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. మీడియా కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 1,050 కోట్లు. ఇది మహేంద్ర సింగ్ ధోని కంటే ఎక్కువ. విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీతో పోలిస్తే.. కోహ్లీ నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు ఎక్కువ. అయితే మనం భారతదేశపు అత్యంత ధనిక క్రికెటర్ గురించి మాట్లాడినట్లయితే సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read: Janata Curfew: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు.. 2020 మార్చి 22న ఏం జరిగిందంటే..?
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో విరాట్ కోహ్లి A++ గ్రేడ్‌లో ఉన్నాడు
మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని మనకు తెలిసిందే. కాగా, విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A++ గ్రేడ్‌లో భాగం. దీని ద్వారా విరాట్ కోహ్లీ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు.
We’re now on WhatsApp : Click to Join
ఐపీఎల్ సీజన్-17 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్‌లో భారత స్టార్ ప్లేయర్లు, కెప్టెన్, మాజీ కెప్టెన్‌లు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ కెప్టెన్సీని వదులుకున్నారు. టీమిండియాకు కీలక ప్లేయర్లుగా ఉండి.. ఐపీఎల్‌లో తమదైన మార్కును ప్రదర్శిస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న ఈ స్టార్స్.. తమ కెప్టెన్సీని వదులుకోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.