HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Disney Hotstar Hits 53 Million Concurrent Viewers

Disney+ Hotstar: టీమిండియా క్రికెటర్లే కాదు అభిమానులు కూడా చరిత్ర సృష్టించారు.. ఏ విషయంలో అంటే..?

వాస్తవానికి సెమీ-ఫైనల్ మ్యాచ్ సమయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)లో భారతీయ ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసార వీక్షకుల రికార్డును కూడా సృష్టించారు.

  • By Gopichand Published Date - 12:56 PM, Thu - 16 November 23
  • daily-hunt
Disney+ Hotstar
Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Disney+ Hotstar: ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత జట్టు చాలా రికార్డులు సృష్టించింది. అయితే ఈ మ్యాచ్‌లో మరో ప్రత్యేక రికార్డు నమోదు అయింది. దీని గురించి పెద్దగా చర్చ లేదు. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ ప్రత్యేక రికార్డు గురించి సమాచారం అందించారు. భారత క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు కూడా తెలిపారు.

భారత అభిమానులు కూడా చరిత్ర సృష్టించారు

వాస్తవానికి సెమీ-ఫైనల్ మ్యాచ్ సమయంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)లో భారతీయ ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసార వీక్షకుల రికార్డును కూడా సృష్టించారు. ఈ మ్యాచ్‌లో ఒకసారి ప్రేక్షకుల సంఖ్య 5.3 కోట్లకు చేరుకుంది. ఇది క్రికెట్ చరిత్రలో ఏ మ్యాచ్‌లోనూ జరగలేదు. భారతీయ ప్రేక్షకులు సృష్టించిన ఈ ప్రత్యేక రికార్డును ప్రశంసిస్తూ, అభినందిస్తూ, జై షా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. కొత్త మైలురాయిని చేరుకుంది! టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసి, సందడితో ఫైనల్స్‌లోకి ప్రవేశించడంతో భారత అభిమానులు ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ అద్భుతమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 5.3 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు. ఇది కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వీక్షకుల రికార్డు ఇదే. ధన్యవాదాలు ఇండియా అని జై షా పేర్కొన్నాడు.

History rewritten, creating new milestones!

As the dominant #TeamIndia advance to the final in roaring fashion, the Indian fans have made this win truly special. The exciting Semi final match garnered a staggering 5.3 Crore views on @DisneyPlusHS, setting a new benchmark for… https://t.co/87vt57w6xc

— Jay Shah (@JayShah) November 16, 2023

Also Read: King Kohli: విరాట పర్వం మళ్లీ మొదలైంది.. కింగ్ కోహ్లీ రికార్డుల వేట..!

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతంగా సాగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచి ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. రోహిత్ ఆరంభం, గిల్ తుఫాను ఇన్నింగ్స్, విరాట్ 50వ వన్డే సెంచరీ, సిక్సర్లతో శ్రేయాస్ సెంచరీ, ఆ తర్వాత కేఎల్ రాహుల్ క్లాసిక్ ఫినిషింగ్ తొలి ఇన్నింగ్స్‌లోనే భారత అభిమానులను ఆనందపరిచాయి. ఆ తర్వాత బౌలింగ్ విషయానికి వస్తే మహ్మద్ షమీ తన మ్యాజిక్ చూపించాడు. దీని కారణంగా భారతీయ ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసారంలో కొత్త రికార్డును సృష్టించారు.

We’re now on WhatsApp. Click to Join.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • disney hotstar
  • ICC World Cup 2023
  • Ind vs NZ
  • India vs New Zealand
  • world cup 2023

Related News

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd