IND vs ENG: ధోనీని గుర్తు చేసిన టీమిండియా వికెట్ కీపర్
రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది
- By Praveen Aluthuru Published Date - 05:23 PM, Mon - 19 February 24

IND vs ENG: రాజ్‌కోట్‌లో ఆదివారం జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మొత్తం 122 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు. అదే సిరీస్‌లో యశస్వి జైస్వాల్ రెండో డబుల్ సెంచరీ సాధించాడు. వీటన్నింటి మధ్య అందరినీ ఆకట్టుకున్న ఓ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు.
ధృవ్ జురెల్ బెన్ డకెట్‌ను రనౌట్ చేసిన తీరు చూస్తుంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకు వచ్చాడు. సిరాజ్ వేసిన త్రోను జురెల్ అద్భుతంగా ఒడిసిపట్టి స్టంప్‌స్ ని గిరాటేశాడు. బెన్ డకెట్ రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన బెన్ డకెట్ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ రనౌట్ చేయడం విశేషం. జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతిని షార్ట్ మిడ్ వికెట్ వైపు నెట్టి సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. అయితే సిరాజ్ బంతిని వేగంగా అందుకుని కీపర్ ఎండ్‌పైకి విసిరాడు. పడిపోతున్న బంతిని జురెల్ క్యాచ్ పట్టి వికెట్లకేసి కొట్టాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దిగ్గజాలు సైతం ధృవ్ ని మెచ్చుకుంటున్నారు.
భారత్ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ అజేయ డబుల్ సెంచరీని సాధించాడు, దీని కారణంగా భారత్ ఇంగ్లాండ్‌కు 557 పరుగుల సవాలు లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు 104 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ అయిన జైస్వాల్, నాలుగో రోజు 91 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చి ఇంగ్లిష్ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 214 పరుగులు చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 430 వద్ద డిక్లేర్ చేసింది. మరో ఎండ్ నుంచి సర్ఫరాజ్ ఖాన్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సర్ఫరాజ్ తన రెండవ అర్ధ సెంచరీని పూర్తి చేసి, 72 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Super Jurel 🦸♂️ with some 🔝glove-work 🔥👌#IDFCFirstBankTestSeries #INDvENG #BazBowled #JioCinemaSports pic.twitter.com/dTlzQZXKAn
— JioCinema (@JioCinema) February 18, 2024
Also Read: NTR Devara : దేవర ఒక్కరు ఇద్దరు కాదా ముగ్గురా..?