Delhi Ranji Trophy: ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్.. కోహ్లీ ఆడటంలేదా?
ఢిల్లీ రంజీ జట్టు తరపున ఆడే సంభావ్య జట్టులో విరాట్ కోహ్లీ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ ఆడతాడా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు.
- By Gopichand Published Date - 09:33 PM, Thu - 16 January 25

Delhi Ranji Trophy: బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై వివాదం కొనసాగుతోంది. టెస్టు టీమ్‌కి తదుపరి కెప్టెన్ ఎవరనే చర్చ సాగుతోంది. చాలా మంది క్రీడా నిపుణులు రిషబ్ పంత్‌ను తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా చేయాలని సూచిస్తున్నారు. అయితే ఇంతకుముందే రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది. ఇది ఎలా జరుగుతుందో తెలిస్తే ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఢిల్లీ రంజీ జట్టుకు (Delhi Ranji Trophy) పంత్‌ని కెప్టెన్‌గా చేసే అవకాశం ఉంది.
జట్టును ఎప్పుడు ప్రకటిస్తారు?
DDCA త్వరలో రంజీ ట్రోఫీ రెండవ రౌండ్ కోసం జట్టును ప్రకటించవచ్చు. ఇందులో రిషబ్ పంత్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. జనవరి 17న DDCA సెలక్షన్ కమిటీ రౌండ్ టూ మ్యాచ్ కోసం జట్టును ప్రకటిస్తుంది. ఈ సమావేశంలో పంత్‌ను కెప్టెన్‌గా చేయడానికి ఆమోదం తెలిపినట్లు ఈ నివేదికలో పేర్కొంది. కాగా జనవరి 23న మ్యాచ్ జరగనుంది. అయితే విరాట్ కోహ్లీ ఆటపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: TDP Membership : టీడీపీ సభ్యత్వ నమోదు కోటికి చేరుకోవడం పట్ల లోకేష్ హర్షం
హౌస్ వార్మింగ్ వేడుకకు సిద్ధమవుతున్న కోహ్లీ
ప్రస్తుతం హౌస్ వార్మింగ్ వేడుకకు టీమిండియా స్టార్ ప్లేయర్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ముంబైలోని అలీబాగ్‌లో విరాట్ కోహ్లీ ఇల్లు సిద్ధంగా ఉంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో కోహ్లీ పేలవ ప్రదర్శన చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్, యూఏఈలో నిర్వహించనున్నారు. విరాట్ కోహ్లీ భారత్‌కు కీలక పాత్ర పోషించగలడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ బ్యాట్ అద్భుత ప్రదర్శన చేసింది. అయితే కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఢిల్లీ రంజీ జట్టు తరపున ఆడే సంభావ్య జట్టులో విరాట్ కోహ్లీ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ ఆడతాడా? లేదా అనేది ఇంకా తెలియరాలేదు. రేపు ఢిల్లీ రంజీ జట్టు ప్రకటించే స్క్వాడ్‌లో విరాట్ ఉంటాడా లేదా అనేది ఇప్పటికి ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడేందుకు సముఖత వ్యక్తం చేయలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి.