Gautam Gambhir: ఆసియా కప్‌కు ముందు గౌతమ్ గంభీర్‌కు భారీ షాక్!
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా తన ప్రదర్శనలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అతని నాయకత్వంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టు తీవ్రంగా పోరాడి ఓడింది.
- By Gopichand Published Date - 05:48 PM, Tue - 26 August 25

Gautam Gambhir: ఆసియా కప్ 2025 దగ్గరపడుతున్న తరుణంలో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్‌కు (Gautam Gambhir) ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ఇబ్బందులు సృష్టించింది. గంభీర్, అతని కుటుంబం, ఫౌండేషన్‌పై కింది కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీనితో ఆసియా కప్ వంటి కీలకమైన టోర్నమెంట్ ప్రారంభానికి ముందు గంభీర్ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.
గౌతమ్ గంభీర్ కష్టాలు పెరిగాయి
కోవిడ్-19 సమయంలో మందులను అక్రమంగా నిల్వ చేసి పంపిణీ చేసిన కేసులో గౌతమ్ గంభీర్ పేరు ఉంది. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌కి ఉపశమనం కల్పించడానికి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నిరాకరించారు. తదుపరి విచారణ తేదీని కూడా ప్రకటించారు. ఆగస్టు 29న ఈ కేసుపై తదుపరి విచారణ జరగనుంది. ఒకవేళ ఆరోజు విచారణ జరగకపోతే సెప్టెంబర్ 8, 2025న కింది కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుంది. కోర్టులో గంభీర్ తరఫు న్యాయవాది పదేపదే గంభీర్ పేరు ప్రస్తావించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పదేపదే పేరు చెప్పినంత మాత్రాన తీర్పు మారదని మందలించింది.
Also Read: IADWS: భారత స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ విజయవంతం!
అసలు కేసు ఏమిటి?
కోవిడ్-19 రెండో దశ సమయంలో గౌతమ్ గంభీర్, అతని కుటుంబం, ఫౌండేషన్ లైసెన్స్ లేకుండా కోవిడ్ సంబంధిత మందులను నిల్వ చేసి పంపిణీ చేశారని ఆరోపిస్తూ ఢిల్లీ ఔషధ నియంత్రణ విభాగం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇంకా ఎటువంటి తీర్పు రాలేదు. తదుపరి విచారణ ఆగస్టు 29న జరగనుంది. ఒకవేళ గంభీర్ తప్పు చేసినట్టు రుజువైతే అతనికి, అతని కుటుంబానికి, ఫౌండేషన్ సీఈఓకి సమస్యలు పెరుగుతాయి.
ఆసియా కప్‌లో గంభీర్‌కు పెద్ద సవాలు
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా తన ప్రదర్శనలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అతని నాయకత్వంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టు తీవ్రంగా పోరాడి ఓడింది. అయితే T20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో కోచ్‌గా గంభీర్ రికార్డు బాగానే ఉంది. ఆసియా కప్ కూడా ఇదే ఫార్మాట్‌లో జరగనుంది. గంభీర్ టీమ్ ఇండియాను తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.