Delhi Capitals: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగే జట్టు ఇదేనా!
ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. ఢిల్లీ బౌలర్లపై రూ. 41.45 కోట్లు వెచ్చించింది.
- By Gopichand Published Date - 09:43 AM, Fri - 20 December 24

Delhi Capitals: ఐపీఎల్ 2025కు సమయం దగ్గరకొస్తుంది. ఇప్పటికే మెగా వేలం పూర్తి చేసుకున్న ఐపీఎల్ మరో మూడు నెలల్లో రసవత్తరమైన మ్యాచ్‌లకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బరిలోకి దిగే జట్టు ఇదే అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈసారి ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మెగా వేలంలో చాలా మంది మంచి ఆటగాళ్లను ఢిల్లీ కొనుగోలు చేసింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నారు. అంతకు ముందు ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను విడుదల చేసింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పుడు కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది. KL రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్, అక్షర్ పటేల్ కొత్త కెప్టెన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో ఒక్కరిని ఢిల్లీ తన జట్టుకు కెప్టెన్‌గా చేసే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌కి సంబంధించి అధికారిక సమాచారాన్ని ఇంకా పంచుకోలేదు. అయితే ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌లతో నిండి ఉంది.
Also Read: Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
మెగా వేలంలో ఈ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించిన ఢిల్లీ
ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ కంటే బౌలర్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. ఢిల్లీ బౌలర్లపై రూ. 41.45 కోట్లు వెచ్చించింది. ఇందులో మిచెల్ స్టార్క్ (రూ. 11.75 కోట్లు), టి.నటరాజన్ (రూ. 10.75 కోట్లు), మోహిత్ శర్మ (రూ. 2.20 కోట్లు), చమీరా (రూ. 75 లక్షలు), ముఖేష్ కుమార్‌ను రూ. 8కోట్లకు కొనుగోలు చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌పై రూ.22.15 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు), హ్యారీ బ్రూక్ (రూ. 6.25 కోట్లు), కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు), ఫాఫ్ డు ప్లెసిస్ (రూ. 2 కోట్లు), డెనోవన్ ఫెరీరా (రూ. 75 లక్షలు) ఉన్నారు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు కేఎల్ రాహుల్ అని మనకు తెలిసిందే.
IPL 2025లో ఢిల్లీ బరిలోకి దిగే జట్టు ఇదే
కెఎల్ రాహుల్, జాక్ ఫ్రేజర్, ఫాఫ్ డు ప్లెసిస్, హ్యారీ బ్రూక్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, టి నటరాజన్.