HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Champions Trophy 2025 India Unlikely To Travel To Pakistan

Champions Trophy 2025: పాక్‌కు వెళ్లేది లేద‌న్న బీసీసీఐ.. శ్రీలంక లేదా దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు..?

ICC ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) 2025 వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో నిర్వహించనున్నారు.

  • Author : Gopi Date : 12-07-2024 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Champions Trophy 2025
Champions Trophy 2025

Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) 2025 వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే దానిపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓ పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ANI నివేదిక ప్రకారం.. BCCI పాకిస్థాన్‌కు టీమిండియాను పంపేందుకు స‌ముఖంగా లేదు. భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లను యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరనుంది. అంతకుముందు గతేడాది పాకిస్థాన్‌లో జరిగిన ఆసియా కప్ సిరీస్‌లో కూడా భారత జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు భారత్‌ ఆడిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరిగాయి.

ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది..?

వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు షెడ్యూల్ క్యాలెండర్‌ను ఐసీసీకి సమర్పించింది. ICC ఇప్పుడు తన సొంత షెడ్యూల్‌ను ప్రకటించనుంది. తన షెడ్యూల్ ప్రకారం.. భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశం అన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్ లాహోర్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

Also Read: Hasaranga: శ్రీలంక‌కు బిగ్ షాక్‌.. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న హ‌స‌రంగ‌..!

ఏయే జట్లు పాల్గొంటాయి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.

బీసీసీఐ అధికారి వెల్లడించారు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత్ పాకిస్థాన్ వెళ్లబోదని బీసీసీఐ అధికారి ఒకరు వార్తా సంస్థ ఏఎన్‌ఐకి తెలిపారు. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీని కోరనుందని ఆయ‌న పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కామెంట్స్‌

భారత ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గతంలో ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అది బీసీసీఐ చేస్తుందన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Champions Trophy 2025
  • ICC Champions Trophy
  • ICC Champions Trophy 2025
  • ind vs pak
  • PCB

Related News

Legal notices served to actor Vijay Deverakonda.

Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీజీ20 (TG20) లీగ్’ చుట్టూ వివాదాలు కమ్ముకుంటున్నాయి తాజాగా ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌ను నిర్వహిస్త

  • Women's T20 World Cup: Pakistan routed by India again.

    Womens T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ చేతిలో మళ్లీ చిత్తైన పాకిస్థాన్..

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd