Champions Trophy 2025: భారత్‌లో క్రికెట్‌కు క్రేజ్ ఎలా ఉందంటే? ఈ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే!
ICC ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారతదేశంలో దాని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు JioStarలో 110 బిలియన్ నిమిషాలతో సహా 137 బిలియన్ నిమిషాల వీక్షణ సమయాన్ని సంపాదించింది.
- By Gopichand Published Date - 11:03 PM, Fri - 21 March 25

Champions Trophy 2025: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy 2025) పాకిస్తాన్‌లో ఆడారు. దుబాయ్‌లో నిర్వహించారు. 2025 సంవత్సరానికి ముందు ఈ టోర్నమెంట్ 2017 సంవత్సరంలో నిర్వహించారు. అప్పుడు పాకిస్తాన్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ భారతదేశంలో వీక్షకుల పరంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. వీక్షకుల గణాంకాలను ICC భాగస్వామ్యం చేసింది.
భారతదేశంలో రికార్డ్ బ్రేకింగ్ వ్యూయర్‌షిప్ నమోదు
ICC ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారతదేశంలో దాని అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో పాటు JioStarలో 110 బిలియన్ నిమిషాలతో సహా 137 బిలియన్ నిమిషాల వీక్షణ సమయాన్ని సంపాదించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నమోదైన వీక్షకుల సంఖ్య ప్రపంచ కప్ 2023 కంటే 23 శాతం మెరుగ్గా ఉంది. ఇది కాకుండా దుబాయ్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా రికార్డ్ వ్యూయర్‌షిప్ నమోదైంది. ఈ మ్యాచ్‌కు భారతదేశంలో టీవీలో 122 మిలియన్ల ప్రత్యక్ష వీక్షణలు వచ్చాయి.
జియోస్టార్‌లో మొత్తం వీక్షకుల సంఖ్య 61 మిలియన్లు. ఇది కాకుండా భారతదేశం న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ భారతదేశ చరిత్రలో అత్యధిక మంది వీక్షించిన రెండవ మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌కు టీవీలో 230 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఫైనల్ మ్యాచ్‌ను టెలివిజన్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో 53 బిలియన్ నిమిషాల పాటు వీక్షించారు.
Also Read: KKR vs RCB: రేపే ఐపీఎల్ ప్రారంభం.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వీక్షకుల సంఖ్యపై వ్యాఖ్యానిస్తూ ICC చైర్మన్ జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణను అద్భుతమైన వీక్షకుల సంఖ్య ప్రతిబింబిస్తుందని.. ICC ఈవెంట్‌లను వివిధ భాషలలోని ప్రేక్షకులకు తీసుకురావడం వల్ల అభిమానుల ఎంగేజ్‌మెంట్ గణనీయంగా పెరుగుతుందని చూపిస్తుందని అన్నారు. బహుళ భాషల్లో టోర్నమెంట్‌ను భారతదేశంలోని ప్రేక్షకులకు అందించిన JioStarకి రికార్డ్-బ్రేకింగ్ నంబర్‌లను క్రెడిట్ చేయవచ్చు. అయితే ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.