Rohit-Virat: కోహ్లీ, రోహిత్ అభిమానులకు భారీ శుభవార్త!
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆస్ట్రేలియా 'ఎ' జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, సెప్టెంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
- By Gopichand Published Date - 04:35 PM, Mon - 18 August 25

Rohit-Virat: భారత క్రికెట్ అభిమానులకు ఒక శుభవార్త. భారత క్రికెట్ జట్టులోని ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit-Virat) చాలా కాలం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్ధమవుతున్నారని సమాచారం. టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి ఇప్పటికే తప్పుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఈ కారణంగానే అభిమానులు వారిని మైదానంలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట వారు అక్టోబర్ 19న మైదానంలోకి తిరిగి వస్తారని వార్తలు రాగా.. ఇప్పుడు సెప్టెంబర్‌లోనే బ్లూ జెర్సీలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్ ‘ఎ’ జట్టులో ఎంపికకు అవకాశం
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, సెప్టెంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో కొన్ని నివేదికల ప్రకారం ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఇండియా ‘ఎ’ జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ నివేదికలు నిజమైతే ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సెప్టెంబర్ 30న మైదానంలోకి తిరిగి రావడం ఖాయమని చెప్పవచ్చు.
Also Read: Web WhatsApp : వెబ్ వాట్సాప్ వారికి హెచ్చరిక..ప్రమాదంలో మీ పర్సనల్ డేటా?
ఎందుకీ రీఎంట్రీ?
టీ20, టెస్టుల నుంచి విరామం తీసుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. వారి వన్డే ఫామ్‌ను కొనసాగించడానికి మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఇలాంటి సిరీస్‌లు చాలా కీలకం. ముఖ్యంగా భవిష్యత్తులో జరగబోయే ముఖ్యమైన వన్డే టోర్నమెంట్ల కోసం వారిని సిద్ధం చేయడానికి ఈ సిరీస్ ఒక మంచి అవకాశం అవుతుంది. ఈ సిరీస్ ద్వారా ఆటగాళ్లకు కీలకమైన మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది, ఇది వారి ఫామ్‌ను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ నిర్ణయం ద్వారా టీమ్ మేనేజ్‌మెంట్ కూడా వారి ఫామ్‌ను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినప్పటికీ అభిమానులు మాత్రం తమ అభిమాన క్రికెటర్లను మైదానంలో చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 30న జరిగే మ్యాచ్‌తో వారి పునరాగమనం సాధ్యమైతే అది క్రికెట్ అభిమానులకు పెద్ద పండగే అవుతుంది.