HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Best Opening Pairs In Ipl

Best Opening Pairs: ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడీలు

ధనాధన్ లీగ్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తుంటారు. పవర్ ప్లేలో బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు చేతులెత్తేయాల్సిందే.

  • Author : Naresh Kumar Date : 30-01-2025 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2025
IPL 2025

Best Opening Pairs: ఐపీఎల్ కి సమయం దగ్గరపడుతోంది. అన్ని జట్ల తమ ఓపెనింగ్ జోడిపై దృష్టి పెట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలు కొత్తవారిని ఓపెనింగ్ కు పంపాలని నిర్ణయించగా, స్టార్ ఫ్రాంచైజీలు మాత్రం సీనియర్లతోనే ఇన్నింగ్స్ ప్రారంబించాలనుకుంటున్నారు. కాగా వచ్చే సీజన్లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ల (Best Opening Pairs) గురించి తెలుసుకుందాం.

ధనాధన్ లీగ్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తుంటారు. పవర్ ప్లేలో బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు చేతులెత్తేయాల్సిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ జోడీ ఐపీఎల్ లోనే బెస్ట్ ఓపెనింగ్ జోడిగా భావిస్తారు. ట్రావిస్ హెడ్ ,అభిషేక్ శర్మ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తే భారీ ఆరంభం లభిస్తుంది. గతంలో వీరిద్దరూ ఎన్నోసార్లు బలమైన ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లుగా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీ ఈ ఓపెనర్లిద్దరినీ నిలుపుకుంది. మరోసారి ఈ జంట ఓపెనింగ్ కు దిగనుంది. వేలానికి ముందు తమ ఓపెనింగ్ జోడీని నిలబెట్టుకున్న జట్లలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఉంది. యశస్వి జైస్వాల్ ,సంజు శాంసన్ రూపంలో ఆర్ఆర్ కు బలమైన ఓపెనర్లున్నారు. వచ్చే సీజన్లోనూ ఈ ఇద్దరు జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సంజు టి20 స్పెషలిస్టుగా రాణిస్తున్నాడు.

Also Read: Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విరాట్ కోహ్లీ వంటి ప్రమాదకరమైన మరియు అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ ఉన్నాడు, విరాట్ ఓపెనర్ గా ఎలాంటి బౌలర్‌నైనా ఈజీగా ఎదుర్కొంటాడు. ఇప్పుడు ఆర్సీబీ ఫిల్ సాల్ట్‌ను కూడా కొనుగోలు చేసింది. విరాట్ మరియు ఫిల్ సాల్ట్ జంట రాబోయే సీజన్‌లో అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలలో ఒకటిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు టి20 ఫార్మెట్లో అద్భుత రికార్డుల్ని నమోదు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Best Opening Pairs
  • cricket news
  • IPL
  • IPL 2025
  • sports news

Related News

There is no certainty that he will play in the IPL.

Hardik Pandya: ఐపీఎల్ లో అతడు ఆడుతాడన్న నమ్మకం లేదు

ఐపీఎల్ (IPL)లో ఎప్పుడూ ఆటగాళ్ల మార్పిడి (ట్రేడింగ్) ఆసక్తికరంగా సాగుతుంటుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ (MI) స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఆ జట్టును వీడటం దాదాపు ఖాయమవ్వడంతో క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హార్దిక్‌ను తమ జట్టులోకి తెచ్చుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ట్రేడింగ్ లేదా భారీ క్యాష్ పేమె

  • Telugu girl Sricharani shines in T20 bowling rankings; Minister Lokesh says AP is proud.

    Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • Only by doing this will India reach the Women's T20 World Cup semi-finals... otherwise, it's back home!

    Women’s T20 World Cup 2026: ఇలా చేస్తేనే మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్ కు ..లేదంటే ఇంటికే..!

Latest News

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd