Jersey Sponsorship: టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ!
బీసీసీఐ, డ్రీమ్ 11 మధ్య 2023లో ఒప్పందం కుదిరింది. ఇది మార్చి 2026 వరకు కొనసాగాలి. కానీ ఆగస్టు 2025లోనే ఈ ఒప్పందం ముగిసింది.
- By Gopichand Published Date - 05:50 PM, Sat - 13 September 25

Jersey Sponsorship: ఆన్‌లైన్ గేమింగ్ సవరణ తర్వాత బీసీసీఐ- డ్రీమ్ 11 మధ్య ఒప్పందం ముగిసింది. దీంతో భారత జట్టు ఆసియా కప్ 2025లో జెర్సీ స్పాన్సర్‌షిప్ లేకుండానే బరిలోకి దిగాల్సి వచ్చింది. బీసీసీఐ కొత్త జెర్సీ స్పాన్సర్‌షిప్ (Jersey Sponsorship) కోసం టెండర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త స్పాన్సర్‌షిప్ గురించి బీసీసీఐ ఒక పెద్ద అప్‌డేట్‌ను ఇచ్చింది. భారత జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ ఎప్పుడు లభిస్తుందని తెలిపింది. ఈ ప్రశ్నకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సమాధానం ఇచ్చారు.
బీసీసీఐ కీలక అప్‌డేట్
భారత జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. “టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో చాలా మంది బిడ్డర్లు ఉన్నారు. దీనిని తుది దశకు చేర్చిన తర్వాత మేము మీకు తెలియజేస్తాము. దీనికి 15-20 రోజులు పట్టవచ్చని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఏ పేరు ఖరారు కాలేదు. చాలా మంది బిడ్డర్లు ఉన్నారు. తుది నిర్ణయం తర్వాత మీకు తెలియజేస్తాము” అని చెప్పారు.
Also Read: Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు: పవన్ కళ్యాణ్
పన్ను మినహాయింపుపై కూడా ప్రకటన
బీసీసీఐకి పన్ను మినహాయింపు లభించడంపై విమర్శలను ఉద్దేశించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. “బీసీసీఐ ఒక కార్పొరేట్ కంపెనీ మాదిరిగా పన్ను చెల్లిస్తుంది. జీఎస్టీ కూడా ఇస్తుంది. మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి మినహాయింపు లభించదు. మేము వేల కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తాము. రాష్ట్ర సంఘాలు కూడా పన్నులు చెల్లిస్తాయి. మేము ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాంట్‌గా తీసుకోము. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం ఒకే సవాలు ఏమిటంటే స్టేడియంలు నిండి ఉండాలి. మహిళలు కూడా మ్యాచ్‌లు చూడటానికి రావాలి. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. జీతాలు కూడా సమానంగా ఉన్నాయి” అని చెప్పారు.
గడువు కంటే ముందే ముగిసిన ఒప్పందం
బీసీసీఐ, డ్రీమ్ 11 మధ్య 2023లో ఒప్పందం కుదిరింది. ఇది మార్చి 2026 వరకు కొనసాగాలి. కానీ ఆగస్టు 2025లోనే ఈ ఒప్పందం ముగిసింది. వాస్తవానికి ఆన్‌లైన్ గేమింగ్ సవరణ తర్వాత అన్ని బెట్టింగ్ యాప్‌లు వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకోవడం నిలిపివేశాయి. దీంతో ఈ యాప్‌లకు భారీ నష్టం వాటిల్లింది.