HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dont Fall Into The Trap Of Those Who Create Discord Between People Pawan Kalyan

Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు: పవన్ కళ్యాణ్

కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు.

  • Author : Gopichand Date : 13-09-2025 - 5:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న తరుణంలో ఇలాంటి కుట్రలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ కుట్రదారుల కుయుక్తులను పదేళ్లుగా చూస్తున్నామని, వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనై ఘర్షణలకు తావీయవద్దని సూచించారు.

కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల్లో అశాంతి, అభద్రత కలిగించే వారి నైజాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఆవేశాలకు లోనైతే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని హెచ్చరించారు.

Also Read: Kia Seltos: ఈ కియా కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌ల డిస్కౌంట్‌!

సమస్యను జటిలం చేయవద్దు

ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొంటూ, ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష వాడడం వెనుక ఉన్న కుత్సిత ఆలోచనను గమనించాలని అన్నారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టాలని, తొందరపడి ఘర్షణలకు దిగి సమస్యను జటిలం చేయవద్దని సూచించారు.

చట్ట ప్రకారం చర్యలు

కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకరంగా మాట్లాడే వారిని భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. వీరి వెనుక ఉన్న వ్యవస్థీకృత కుట్రదారులపై కూడా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని స్పష్టం చేశారు. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ జరిపించాలని, ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Deputy CM Pawan
  • Janasena
  • nda govt
  • Pawan Kalyan

Related News

Pemmasani Chandrasekhar Ama

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత మంత్రి పెమ్మసాని

భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 2024 నుంచే ఈ చట్టబద్ధత అమల్లోకి వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే అటార్నీ జనరల్‌తో చర్చలు జరిగాయని చెప్పారు. అమర

  • Pawan Amaravati

    వైసీపీ నేతలకు అవసరమైతే యూపీ సీఎం యోగి తరహా ట్రీట్‌మెంట్ – పవన్ కళ్యాణ్

  • Ttd

    ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

  • Satya Kumar Dares Jagan

    జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • Janasena Meetting

    డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

Latest News

  • రేవంత్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు!

  • శారీరక బలహీనతను తరిమికొట్టే అద్భుత చిట్కా ఇదే!

  • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

  • దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చెప్పిన కీల‌క అంశాలీవే!

  • టీమిండియాపై బీసీసీఐ కఠిన చర్యలు?

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd