సూర్యకుమార్ యాదవ్ తర్వాత భారత్ తదుపరి కెప్టెన్ ఎవరు?
ఇకపోతే ప్రస్తుతం టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే బలంగానే కనిపిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ పొట్టి ఫార్మాట్‌కు కోహ్లీ, రోహిత్ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే.
- Author : Gopichand
Date : 23-12-2025 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
T20I Captain: టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7, 2026 నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంకా 50 రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కెప్టెన్‌గా సూర్య రికార్డు చాలా అద్భుతంగా ఉంది. ఆయన నాయకత్వంలో భారత్ ఆడిన 38 మ్యాచ్‌ల్లో 28 విజయాలు నమోదు చేయగా, కేవలం 6 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. అందుకే టీ20 వరల్డ్ కప్ గెలవడానికి సూర్య సారథ్యంలోని భారత్ బలమైన జట్టుగా కనిపిస్తోంది. అయితే ఇటీవల బ్యాటర్‌గా సూర్య ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. దీనివల్ల వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీలో మార్పులు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
సూర్య స్థానంలో కొత్త కెప్టెన్ ఎవరు?
టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత 2028 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్ ఇండియా యాజమాన్యం కెప్టెన్సీలో మార్పులు చేసే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ బాధ్యత శుభ్‌మన్ గిల్‌కు దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గిల్ టీ20 జట్టులో లేనప్పటికీ టెస్ట్, వన్డే ఫార్మాట్లలో వైస్ కెప్టెన్ లేదా కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నారు. మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో కోచ్, సెలెక్టర్లు గిల్‌ను మళ్లీ టీ20ల్లోకి తీసుకువచ్చి కెప్టెన్సీ అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గిల్ కాకుండా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా కెప్టెన్సీకి మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు.
Also Read: దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
ఇకపోతే ప్రస్తుతం టీమిండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే బలంగానే కనిపిస్తోంది. 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ పొట్టి ఫార్మాట్‌కు కోహ్లీ, రోహిత్ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీ20 జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే ఇటీవల సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఫామ్ సమస్యతో బాధపడుతున్నాడు. నివేదికల ప్రకారం.. 2026 టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్య ఈ ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వైదొలగనున్నట్లు సమాచారం.