సచిన్ ఇంట పెళ్లి సందడి.. త్వరలో మామగా మారనున్న మాస్టర్ బ్లాస్టర్!
అయితే ఇటీవల అర్జున్ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆయన ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బ్యాటింగ్‌లో కూడా కనీసం ఒక అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు.
- Author : Gopichand
Date : 07-01-2026 - 1:42 IST
Published By : Hashtagu Telugu Desk
Arjun Tendulkar: సచిన్ టెండూల్కర్ త్వరలో మామగారు కాబోతున్నారు. ఎందుకంటే ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. అర్జున్ తన కాబోయే భార్య సానియా చందోక్‌ను మార్చి 2026లో వివాహం చేసుకోనున్నారు. సానియా ఒక బిజినెస్ ఉమెన్, ఆమె కుటుంబానికి కూడా మంచి గుర్తింపు ఉంది. ఆమె ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు.
ఆగస్టులో జరిగిన నిశ్చితార్థం
అర్జున్, సానియాల నిశ్చితార్థం చాలా రహస్యంగా జరిగింది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక ముగిసింది. అందుతున్న నివేదికల ప్రకారం.. వివాహ వేడుకలు మార్చి 3, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేడుక మార్చి 5న జరగనుంది.
కుమారుడి నిశ్చితార్థం గురించి సచిన్ టెండూల్కర్ స్వయంగా ధృవీకరించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. “అవును నిశ్చితార్థం జరిగింది. వారి జీవితంలో ప్రారంభం కాబోతున్న ఈ కొత్త దశ పట్ల మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాం” అని మాస్టర్ బ్లాస్టర్ తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఈ వివాహం ముంబైలో అత్యంత ప్రైవేట్‌గా జరగనుంది. దీనికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రికెట్ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు మాత్రమే హాజరుకానున్నారు.
Also Read: గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..
అర్జున్ ప్రస్తుత ప్రదర్శన
అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్‌లో గోవా జట్టు తరపున ఆడుతున్నారు. ఆయన గణాంకాలు ఇలా ఉన్నాయి.
ఫస్ట్ క్లాస్ క్రికెట్: 22 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు, 620 పరుగులు.
లిస్ట్ A క్రికెట్: 23 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు, 155 పరుగులు.
T20 క్రికెట్: 29 మ్యాచ్‌ల్లో 35 వికెట్లు, 189 పరుగులు.
అయితే ఇటీవల అర్జున్ ఫామ్ అంత ఆశాజనకంగా లేదు. తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆయన ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బ్యాటింగ్‌లో కూడా కనీసం ఒక అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు.