ICC CEO Allardice: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఐసీసీకి షాక్.. కీలక వ్యక్తి రాజీనామా
ఐసీసీ సీఈవో జియోఫ్ 2012 సంవత్సరంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అతను ICCలో జనరల్ మేనేజర్‌గా చేరాడు.
- By Gopichand Published Date - 09:53 AM, Wed - 29 January 25

ICC CEO Allardice: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో కలకలం రేగింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జియోఫ్ అల్లార్డిస్ (ICC CEO Allardice) తన రాజీనామాను ప్రకటించాడు. జియోఫ్ ప్రకటనతో ఐసీసీ చైర్మన్ జై షాలో ఆందోళన మొదలైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. అల్లార్డిస్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కాకుండా అతను తన పదవిని వదిలివేయడంతోపాటు ప్రకటన కూడా విడుదల చేశాడు. అసలు ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐసీసీ సీఈవో జియోఫ్ 2012 సంవత్సరంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత అతను ICCలో జనరల్ మేనేజర్‌గా చేరాడు. నవంబర్ 2021లో అతను ఎనిమిది నెలలపాటు తాత్కాలిక CEOగా పనిచేశాడు. అయితే ఆ తర్వాత అతడిని ఐసీసీ సీఈవోగా నియమించారు.
Also Read: Mahakumbh Stampede: మౌని అమావాస్య కలిసి రావటంలేదా? కుంభమేళాలో గతంలో కూడా తొక్కిసలాట ఘటనలు!
ఈ విషయాన్ని జియోఫ్ అల్లార్డిస్ తెలిపారు
తన రాజీనామాకు సంబంధించి ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేయడం గొప్ప అదృష్టం. మేము సాధించిన ఫలితాల పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. క్రికెట్ ప్రపంచ స్థాయిని పెంచడం నుండి ICC సభ్యుల కోసం వాణిజ్య స్థావరాన్ని సృష్టించడం వరకు ప్రతిదీ ఇందులో ఉంది. గత 13 సంవత్సరాలుగా మద్దతు, సహకారం అందించినందుకు ICC ప్రెసిడెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మొత్తం క్రికెట్ కమ్యూనిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ఇదే సరైన సమయమని నమ్ముతున్నాను. క్రికెట్‌కు ఉత్కంఠభరితమైన సమయాలు రానున్నాయని నేను విశ్వసిస్తున్నాను. ICC, గ్లోబల్ క్రికెట్ కమ్యూనిటీ భవిష్యత్తులో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. అయితే ఆయన రాజీనామా ఎందుకు చేశారో అనే విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. సీఈవో అల్లార్డిస్ చాలా అంకితభావంతో పని చేశారని ఐసీసీ చైర్మన్ జై షా తెలిపారు.
Geoff Allardice has resigned as chief executive of the ICC after four years in the role, citing a desire to “pursue new challenges”.
He was appointed as CEO in November 2021, having previously served as the acting CEO for eight months pic.twitter.com/ZyiHm1GlLV
— ESPNcricinfo (@ESPNcricinfo) January 28, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ సన్నద్ధత సరిగా లేకపోవడం గురించి సీఈవో స్పష్టంగా వివరించడలేకపోవడం కూడా అతడి రాజీనామాకు ఒక కారణమని ఓ ఐసీసీ సభ్యుడు చెప్పినట్లు నివేదికలు వస్తున్నాయి.