కేకేఆర్‌కు దెబ్బ మీద దెబ్బ!
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ సమయంలో ఆకాష్ దీప్‌కు గ్రోయిన్ (తొడ పైభాగం) గాయమైంది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ (2025/26) ఆడుతున్నప్పుడు మళ్ళీ నడుము కింది భాగంలో గాయమైంది.
- Author : Gopichand
Date : 22-03-2026 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
KKR: ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ వేగవంతమైన బౌలర్ ఆకాష్ దీప్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఈ పేసర్‌కు గాయాలతో ఉన్న సంబంధం కొత్తేమీ కాదు తన అరంగేట్రం నుండి అతని కెరీర్లో అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా అందుబాటులో లేకపోవడం మరోవైపు మతీషా పతిరానా ఏప్రిల్ మధ్యలో జట్టులో చేరే అవకాశం ఉండటంతో, ప్రస్తుతం కేకేఆర్ పేస్ విభాగం బలహీనంగా మారింది.
ఆకాష్ దీప్ గాయాల చరిత్ర
ఆకాష్ దీప్ ఐపీఎల్ ప్రయాణం 2022లో ఆర్సీబీ (RCB)తో ప్రారంభమైంది. అప్పటి నుండి అతని కెరీర్ గ్రాఫ్ ఇలా ఉంది.
IPL 2022: కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
IPL 2023 & 2024: లోయర్ బ్యాక్ స్ట్రెస్ ఇంజరీ (నడుము నొప్పి) కారణంగా 2023లో 2 మ్యాచ్‌లు, 2024లో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు.
Also Read: kangana Ranaut : బాలీవుడ్ లో బాంబ్ పేల్చిన “కంగనా రనౌత్”
IPL 2025: సీజన్ ప్రారంభానికి ముందే గాయం కావడంతో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. సగటు (76+) చాలా పేలవంగా ఉంది. మొత్తంగా గాయాల కారణంగా ఆకాష్ దీప్ ఐపీఎల్లో క్రమం తప్పకుండా ఆడలేకపోయాడు. ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 10 వికెట్లు మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ సిరీస్‌ల్లోనూ గాయాల బెడద
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ సమయంలో ఆకాష్ దీప్‌కు గ్రోయిన్ (తొడ పైభాగం) గాయమైంది. ఈ ఏడాది ప్రారంభంలో బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ (2025/26) ఆడుతున్నప్పుడు మళ్ళీ నడుము కింది భాగంలో గాయమైంది. ప్రస్తుతం ఆయన బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నాడు. అతను పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేయగా ఆశించిన ప్రదర్శన చేయకపోవడంతో అతన్ని విడుదల చేసింది. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ మిినీ వేలంలో రూ. 1 కోటి వెచ్చించి అతన్ని దక్కించుకుంది.