Biden Visits: భారత్ కు బైబై.. వియత్నాంకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు బైడెన్..!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden Visits) ఆదివారం ఉదయం వియత్నాం బయలుదేరి వెళ్లారు. భారతదేశం నుండి బయలుదేరే ముందు బైడెన్ మహాత్మా గాంధీ స్మారక రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు.
- By Gopichand Published Date - 01:51 PM, Sun - 10 September 23

Biden Visits: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden Visits) ఆదివారం ఉదయం వియత్నాం బయలుదేరి వెళ్లారు. భారతదేశం నుండి బయలుదేరే ముందు బైడెన్ మహాత్మా గాంధీ స్మారక రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. జో బైడెన్ శుక్రవారం అర్థరాత్రి భారత్‌కు వచ్చారు. భారత్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. ఈ చర్చ సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, వైవిధ్యపరచడంపై చర్చ జరిగింది.
31 డ్రోన్‌లను కొనుగోలు చేయడంతోపాటు జెట్ ఇంజన్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా భారత్ చేస్తున్న చర్యను ఆయన స్వాగతించారు. శనివారం జరిగిన జి20 సదస్సులో బైడెన్ కూడా పాల్గొన్నారు.
Also Read: Rishi Sunak Net Worth: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?
జి-20 సందర్భంగా బైడెన్ ఏం చెప్పారు?
జో బైడెన్ G-20 శిఖరాగ్ర సమావేశంలో తక్కువ, మధ్య-ఆదాయ దేశాలకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ సామర్థ్యాన్ని పెంచడంపై ఉద్ఘాటించారు. “మా ఉమ్మడి సహకారంతో, IBRD (ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్)కి ప్రపంచ బ్యాంక్ వార్షిక రాయితీ లేని రుణాల వాల్యూమ్‌కు మూడు రెట్లు సమానమైన వన్-టైమ్ మద్దతును అందించడానికి, IDA సంక్షోభ రుణ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని వైట్ హౌస్ పేర్కొంది.
“ఈ చొరవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు పేద దేశాల తక్షణ అవసరాలను తీర్చడానికి అవసరమైన వనరులను అందించగల సామర్థ్యం గల ప్రపంచ బ్యాంకును ఒక బలమైన సంస్థగా మారుస్తుంది” అని వైట్ హౌస్ పేర్కొంది. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా చైనా గురించి ఒక ప్రశ్న అడిగారు. వాస్తవానికి జి జిన్‌పింగ్ గైర్హాజరు జి20 నేతల శిఖరాగ్ర సదస్సుపై ఏమైనా ప్రభావం చూపిందా అని అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరై ఉంటే బాగుండేదని, అయితే ఇది (సమావేశం) మరింత మెరుగ్గా సాగుతోంది’ అని అన్నారు.