Two People Died: పండగ పూట విషాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది. ఓ కారు అతివేగంగా వచ్చి దేవాలయం గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో దుర్మరణం చెందగా (Two People Died).. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
- Author : Gopichand
Date : 14-01-2023 - 9:25 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది. ఓ కారు అతివేగంగా వచ్చి దేవాలయం గోడను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు స్పాట్ లో దుర్మరణం చెందగా (Two People Died).. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. కృష్ణా జిల్లా చల్లపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి దేవాలయం గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Also Read: Lion: సింహాన్ని గిరగిరా తిప్పేసిన మహిళ.. షాకింగ్ వీడియో వైరల్!
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని సత్యనారాయణ, గుడి రాజేశ్‌లుగా గుర్తించారు. అనంతరంపోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.