Haj Pilgrim: మక్కాలో కన్నుమూసిన తెలంగాణ హజ్ యాత్రికుడు
ముస్లింలు హజ్ యాత్రను దైవంతో సమానంగా భావిస్తారు. సౌదీ అరేబియాలో కొలువై ఉన్న మక్కాను దర్శించుకోవాలనేది సగటు ముస్లిం కల. జీవితకాలం సంపాదించిన డబ్బంతా హజ్ యాత్ర కోసం వెచ్చిస్తారు.
- By Praveen Aluthuru Published Date - 02:39 PM, Tue - 27 June 23

Haj Pilgrim: ముస్లింలు హజ్ యాత్రను దైవంతో సమానంగా భావిస్తారు. సౌదీ అరేబియాలో కొలువై ఉన్న మక్కాను దర్శించుకోవాలనేది సగటు ముస్లిం కల. జీవితకాలం సంపాదించిన డబ్బంతా హజ్ యాత్ర కోసం వెచ్చిస్తారు. అంత గొప్ప మక్కాలో మరణించడం అదృష్టంగా భావిస్తారు కొందరు. తాజాగా తెలంగాణ యువకుడు మక్కాలో మరణించాడు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన హజ్ యాత్రికుడు సౌదీ అరేబియాలోని మక్కాలో కన్నుముశాడు. దాంతో ఆ వ్యక్తిని మక్కా సమీపంలోని షరాయా స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
మహబూబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ షంషీర్ పాషా తన భార్య శ్రీమతి షాహినా బేగంతో కలిసి హజ్ యాత్రకు బయలుదేరాడు. అనుకోకుండా ఆ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆరోగ్యం క్షీణించింది. అతనిని ఆసుపత్రిలో చేర్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇండియన్ హజ్ మిషన్ అధికారుల పర్యవేక్షణలో జుహర్ ప్రార్థనల తర్వాత మక్కా సమీపంలోని షరాయా స్మశానవాటికలో ఖననం చేశారు.
Read More: Etela Jamuna: ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల జమున సంచలన ఆరోపణలు!