Bhadrachalam : కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఐటీసీ నుంచి క్రేన్లు, పొక్లెయిన్లు రప్పిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు.
- Author : Latha Suma
Date : 26-03-2025 - 5:10 IST
Published By : Hashtagu Telugu Desk
Bhadrachalam : భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. కూలీలు ఆ భవనం కింద పని చేస్తున్న టైంలో ప్రమాదం జరిగింది. శిథిలాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Also: State Food Lab : ఏపీలో అందుబాటులోకి రాబోతున్న స్టేట్ ఫుడ్ ల్యాబ్
నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఐటీసీ నుంచి క్రేన్లు, పొక్లెయిన్లు రప్పిస్తున్నారు. కూలిన భవనం పక్కనే ఓ ఆలయం కూడా నిర్మిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు.
కాగా, ఆ భవనంపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు అధికారులుక వచ్చాయి. భద్రాచలంలో కుప్పకూలిన భవనంపై ఉన్న ఫిర్యాదుల మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలోనే నోటీసులు జారీ చేశారు. నాసిరకం మెటీరియల్‌తో కడుతున్నారని గ్రహించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ చర్యలకు ఆదేశించారు. కూల్చివేయాలని అధికారులకు చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందుకున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Rahul Gandhi : ఇదో కొత్త ఎత్తుగడ..ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు : రాహుల్ గాంధీ