State Food Lab : ఏపీలో అందుబాటులోకి రాబోతున్న స్టేట్ ఫుడ్ ల్యాబ్
State Food Lab : ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత మరో మూడు ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్‌లు తిరుపతి, గుంటూరు, తిరుమలలో అందుబాటులోకి రానున్నాయి
- By Sudheer Published Date - 04:54 PM, Wed - 26 March 25

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ (State Food Lab) అందుబాటులోకి రాబోతుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రయోగశాల ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ఆరు నెలల తర్వాత మరో మూడు ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్‌లు తిరుపతి, గుంటూరు, తిరుమలలో అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు విశ్వసనీయ కేంద్రాలు ఏర్పడనున్నాయి.
Import Duty: మొబైల్, ఈ-వాహన వినియోగదారులకు శుభవార్త.. ధరలు భారీగా తగ్గే ఛాన్స్?
విశాఖపట్నం స్టేట్ ఫుడ్ ల్యాబ్ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించబడుతోంది. ఇది ప్రభుత్వ ఏజెన్సీలు సేకరించే అన్ని రకాల ఆహార పదార్థాలను పరీక్షించే అధునాతన పరికరాలతో నిర్మించనున్నారు. అంతేకాదు ప్రైవేట్ వ్యక్తులు తమ ఆహార పదార్థాలను పరీక్షించుకునేందుకు వీలుంటుంది. కాకపోతే వారు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గుంటూరు, తిరుపతిలోనూ రూ.19 కోట్ల వ్యయంతో రెండు ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. గుంటూరులో మెడికల్ కాలేజీ సమీపంలో మరియు తిరుపతిలో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్రయోగశాలలు అందుబాటులోకి రానున్నాయి.
Rahul Gandhi : ఇదో కొత్త ఎత్తుగడ..ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు : రాహుల్ గాంధీ
తిరుమలలో టీటీడీ తయారు చేసే ప్రసాదాలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించేందుకు ప్రత్యేక ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నారు. ఇది తిరుమలలోని భక్తులకు స్వచ్ఛమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతీయ ఫుడ్ ల్యాబ్‌లకు అవసరమైన ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టలేషన్ కోసం టెండర్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. అధికారులు ఆరు నెలలలో ఈ ప్రయోగశాల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టేట్ ఫుడ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే, ఆహార నాణ్యత నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ రాష్ట్రంగా ఎదగనుంది.