Madhya Pradesh Elections: రూ.500లకే ఎల్పీజీ సిలిండర్: ప్రియాంక గాంధీ
మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జబల్‌పూర్‌లోని షహీద్ స్మారక్ మైదాన్ నుండి కాంగ్రెస్ ఎన్నికల
- By Praveen Aluthuru Published Date - 03:08 PM, Mon - 12 June 23

Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జబల్‌పూర్‌లోని షహీద్ స్మారక్ మైదాన్ నుండి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత పెన్షన్ అమలు చేస్తామని, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని చెప్పారు. మహన్ నారీ సమ్మాన్ నిధికి రూ.1500 చొప్పున మహిళలకు అందజేస్తామని తెలిపారు. దీంతో పాటు కమల్ నాథ్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైతుల రుణమాఫీని పూర్తి చేస్తానని, ఇది నా హామీ అంటూ ప్రకటించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలను కర్ణాటక, హిమాచల్‌లో నెరవేర్చామని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 100 యూనిట్ల విద్యుత్‌ను మాఫీ చేస్తామని, 200 యూనిట్ల విద్యుత్ బిల్లు సగానికి తగ్గుతుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. .
మధ్యప్రదేశ్‌లో అవినీతి ప్రభుత్వం నడుస్తున్నదని మండిపడ్డారు ప్రియాంక గాంధీ. బీజేపీ హయంలో మధ్యప్రదేశ్‌లో 225కు పైగా కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్‌లో కుంభకోణాలు జరగని ప్రాంతమే లేదని ఆరోపించారు. ఇప్పుడు రైతులకు నష్టపరిహారం పంపిణీ కూడా మోసంగా మారిందన్నారు. మూడేళ్లలో కేవలం 21 మంది నిరుద్యోగులకు మాత్రమే ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించిందని అన్నారు.
మధ్యప్రదేశ్‌లో ప్రియాంక గాంధీ ఎన్నికల వాగ్దానాలు:
మధ్యప్రదేశ్‌లో పాత పెన్షన్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటన.
ఎంపీలో రూ.500కే ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని ప్రకటన.
మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని ప్రకటన.
మధ్యప్రదేశ్ రైతుల రుణమాఫీ ప్రకటన.
Read More: Vastu Tips-Food Eating : ఏ దిక్కుకు తిరిగి భోజనం చేయాలో తెలుసా ?