Rahul Gandhi Marriage: విపక్షాల మీటింగ్ రాహుల్ పెళ్లి కోసమేనా?
శుక్రవారం పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం కేవలం రాహుల్ గాంధీ పెళ్లిపై చర్చ కోసమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
- Author : Praveen Aluthuru
Date : 24-06-2023 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi Marriage: శుక్రవారం పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశం కేవలం రాహుల్ గాంధీ పెళ్లిపై చర్చ కోసమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. పాట్నాలో జరిగిన ఈ భేటీ వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న డ్రామాగా అభివర్ణించారు ఠాకూర్. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడో విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన భేటీలో విపక్ష నేతలు రాహుల్ గాంధీ వివాహ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారని వ్యంగంగా స్పందించారు ఠాకూర్. రాహుల్ పెళ్లి విషయమై విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు కానీ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వరన్నారు. ఇక విపక్షాల మీటింగ్ పై ఠాకూర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల ముందు ఆర్టిస్టులంతా ఒక్క చోటకు చేరారు. క్యారెక్టర్లు కూడా ఫైనల్ అయ్యాయి. ఇక డ్రామా మొదలవుతుంది అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించేందుకు దేశంలోని విపక్షాలు ఏకమయ్యాయి. మోడీకి వ్యతిరేక శక్తుల్ని కూడగడుతున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఎదుర్కోవడానికి పొత్తు పెట్టుకునే మార్గాలను అన్వేషించడానికి 17 ప్రతిపక్ష పార్టీల నాయకులు శుక్రవారం పాట్నాలో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశాన్ని బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదు. విపక్ష భేటీ కేవలం రాహుల్ పెళ్లి కోసం జరిగే చర్చ మాత్రమేనని, అయితే రాహుల్ పెళ్ళికి విపక్షాలు ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిగ్ గా మారాయి.
Read More: H-1B Visa: హెచ్- 1బీ వీసా ఉన్న భారతీయులకు శుభవార్త.. ఎందుకంటే..?