Amaravati : మున్సిపాలిటీ వద్దు.. రాజధాని ముద్దు.. తుళ్లూరు గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
- Author : Prasad
Date : 18-09-2022 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ తుళ్లూరు గ్రామసభలో రాజధాని ప్రాంత ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తుళ్లూరు మండలలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల ప్రజల మూకుమ్మడి ఏకగ్రీవ తీర్మానం చేశారు.హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల కోసం భూములు త్యాగం చేయమని.. ఆనాడు అధికారులే ప్రజల వద్దకు వచ్చారని రైతులు తెలిపారు. మూడు రాజధానుల బిల్లును ఉద్యోగ సంఘాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని వారు ప్రశ్నించారు. మెట్రో పాలిటన్ సిటీనే వద్దంటే మున్సిపాలిటీ పేరుతో అధికారులు పెట్టే గ్రామసభలను ఆమోదించమని తుళ్లూరు వాసులు స్పష్టం చేశారు.