Bommai: 31న బంద్ ను విరమించుకోవాలి- సీఎం
- By hashtagu Published Date - 12:20 PM, Thu - 30 December 21

కర్ణాటక లో మహారాష్ట్ర ఎక్కికారన్ సమితి (MES)ని శాశ్వతంగా బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పలు కన్నడ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 31న బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజా బొమ్మాయి బంద్ ను విరమించుకోవాలని కోరారు. మహారాష్ట్రలో కన్నడ జండాను తగలపెట్టి, కన్నడిగుల స్వాత్యంత్ర సమరయోధుడు సంగోళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకుగాను ఆ రాష్ట్రానికి చెందిన మహారాష్ట్ర ఎక్కికారన్ సమితిని బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తూ కన్నడ సంస్థలు డిసెంబరు 31న బందుకు పిలుపునిచ్చాయి.
ప్రభుత్వం వారి డిమాండ్ ను పరిశీలిస్తుందని.. త్వరలో చర్యలు తీసుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారు. కాగా 31న బందుకు బదులు ఇతర విధానాల ద్వారా నిరసనలు చేపట్టుకోవాలని కన్నడ సంస్థలను ఆయన కోరారు.