India: రాష్ట్రం మొత్తం AFSPAను విస్తరించిన కేంద్రం
- By hashtagu Published Date - 11:29 AM, Thu - 30 December 21

AFSPA ను గురువారం నుండి మరో ఆరు నెలల వరకు నాగాలాండ్ రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. AFSPA ( ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో డిమాండ్లకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. AFSPA సైనికులకు అపరిపిమిత అధికారాలు ఇస్తుంది. వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు సాక్ష్యాధారాలు లేకుండా ఒకవేళ ఎన్ కౌంటర్ చేసిన కేసు నమోదు కాదు. ఈ యాక్ట్ ను ఉపయోగించుకొని సైనికులు అనేక అకృత్యాలకు పాల్పడ్డారు.
ఇటీవలే నాగాలాండ్ లోని మాన్ జిల్లాలో అమాయకులైన 14 మంది సాధారణ పౌరులైన కూలీలను అనుమానం వచ్చి కాల్చి చంపేశారు. కనీసం వారిని విచారణ చేయడానికి కూడా సైనికులు ప్రయత్నించకుండ పిట్టల్లా కాల్చి చంపారు. ఈ విషయం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పొరపాటున కాల్చారు అని అన్నారు. ఆ సమాధానంతో పౌరుల ప్రాణాలకు ప్రభుత్వం ఎంత విలువిస్తుందో అర్థం అవుతుంది. ఇలాంటి ఘటనల మధ్య ఆ యాక్ట్ ను పూర్తిగా రద్దు చేయకుండా రాష్ట్రం మొత్తం విస్తరించడం పై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Armed Forces (Special Powers) Act 1958 (AFSPA) extended in Nagaland for six more months with effect from today. pic.twitter.com/Vkw3fPGeJK
— ANI (@ANI) December 30, 2021