TTD: తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం
- By hashtagu Published Date - 02:24 PM, Thu - 30 December 21
తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానాల అదనపు కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి దుకాణదారులు సహకరించాలని ఆయన కోరారు. భక్తులకు అందించేందుకు బయో డిగ్రేడబుల్ క్యారీ బ్యాగులు వినియోగించాలని వారికి సూచించారు. ఈ మేరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో దుకాణాల నిర్వాహకులతో ధర్మారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు దుకాణదారులు పలు సమస్యలను వివరించారు.