WhatsApp : 74 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్
- Author : Pasha
Date : 02-10-2023 - 8:43 IST
Published By : Hashtagu Telugu Desk
WhatsApp : 74 లక్షల వాట్సాప్ అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా లేని అకౌంట్లపై నిషేధం కొరడాను ఝుళిపించింది. ఆగస్టు 1 నుంచి 31 మధ్య టైంలో 74 లక్షల అకౌంట్లను బ్యాన్ చేశామని వాట్సాప్ ప్రకటించింది. అన్ని పెద్ద సోషల్ మీడియా కంపెనీలు ప్రతి నెలా వాటి జవాబుదారీతనంపై స్వీయ నివేదికలను విడుదల చేయాలని 2021లో విడుదలైన నూతన ఐటీ రూల్స్ చెబుతున్నాయి. వాటిని అనుసరించి ఇప్పుడు వాట్సాప్ కంపెనీ.. ఆగస్టు నెల రిపోర్టును రిలీజ్ చేసింది. వాట్సాప్‌కు ఆగస్టులో రికార్డు స్థాయిలో 14,767 ఫిర్యాదులు వచ్చాయి. అయితే వాటిలో కేవలం 71 ఫిర్యాదులకు ప్రతిస్పందనగా చర్యలు తీసుకుంది.
Also read : Nayanthara vs Trisha: ఏ మాత్రం క్రేజ్ తగ్గని తమిళ్ లేడి సూపర్ స్టార్స్
2021లో విడుదలైన నూతన ఐటీ రూల్స్ ప్రకారం.. 50 లక్షల కంటే ఎక్కువ యూజర్ బేస్ ఉన్న ప్రతి సోషల్ మీడియా కంపెనీ ప్రతి నెలా ఒక సవివరమైన రిపోర్ట్‌ను ప్రజల కోసం విడుదల చేయాల్సి ఉంటుంది. వినియోగదారుల నుంచి ఆ నెలలో అందిన ఫిర్యాదులెన్ని ? ఎన్ని ఫిర్యాదులకు పరిష్కారాన్ని చూపించారు ? అనేది తెలియజేయాల్సి ఉంటుంది. మన దేశంలో వాట్సాప్ కు దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. సోషల్ మీడియా సంస్థలను ప్రజలకు జవాబుదారీగా చేసే ఉద్దేశంతో నూతన ఐటీ రూల్స్ ను (WhatsApp – 74 Lakh Accounts) తీసుకొచ్చారు.