Nayanthara vs Trisha: ఏ మాత్రం క్రేజ్ తగ్గని తమిళ్ లేడి సూపర్ స్టార్స్
నటి నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్‌గా ట్రీట్ చేస్తారు. నయన్ తాజా చిత్రం లార్డ్ ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఆమెకు పెద్దగా స్కోప్ లేదంటూ పలు విమర్శలు వచ్చాయి
- Author : Praveen Aluthuru
Date : 02-10-2023 - 8:22 IST
Published By : Hashtagu Telugu Desk
Nayanthara vs Trisha: నటి నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్‌గా ట్రీట్ చేస్తారు. ప్రస్తుతం నయన్ చేతిలో వరుసగా ఐదు చిత్రాలున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. నయనతార ప్రస్తుతం రూ. 10 కోట్ల నుంచి రూ. 11 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దీంతో తమిళ చిత్రసీమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నిలిచింది. నయనతార కంటే త్రిష ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. లియో, విడతల వంటి అగ్రతారల చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఆ తర్వాత కమల్-మణిరత్నంల సినిమాలో హీరోయిన్ గా కమిట్ అయినట్లు సమాచారం.
త్రిష ఒక్క ప్రాజెక్టుకు రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. నయనతార కంటే త్రిష మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తమిళ్ సినీ సిర్కిల్ లో టాక్. అయితే ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియరాలేదు. ఈ సీనియర్ బ్యూటీస్ నాలుగు పదులకు దగ్గరపడినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. జూనియర్ హీరోయిన్స్ ఒక్క సినిమాకే లగేజ్ సర్దేస్తున్నారు. కానీ త్రిష, నయనతార సినిమా ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతుంది. అయినా వాళ్లకు వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం నయన్, త్రిష పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం ఇప్పటికే సైన్ చేశారు. అయితే వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ప్రొఫెషన్ పరంగా మాత్రం పోటీ ఉందన్న మాట వాస్తవం.
Also Read: One Plus Diwali Sale : వన్ ప్లస్ దివాళి సేల్ ఆఫర్స్ ఇవే..!