Minister Uttam Kumar Reddy: ప్రమాద స్థలానికి మంత్రులు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తమ్, జూపల్లి
ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు.
- By Gopichand Published Date - 04:22 PM, Sat - 22 February 25

Minister Uttam Kumar Reddy: నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదం జరిగిన స్థలానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy), జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. దోమలపెంటలోని జె.పి గెస్ట్ హౌస్ లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాద ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్య దాస్ నాధ్,ఐజి సత్యనారాయణ, అగ్నిమాపక డి.జి జి.వి నారాయణ రావు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్ఎల్‌బీసీ పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Loan Foreclosure Charges: బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే వారికి గుడ్ న్యూస్..!
Irrigation Minister Uttam Kumar Reddy visited site where atleast six persons are feared trapped after a section of the SLBC tunnel behind Srisailam dam near Domalapenta collapsed on Saturday morning.
The accident reportedly happened due to the slippage of a concrete segment used… pic.twitter.com/jpXrSKxUwL
— Naveena (@TheNaveena) February 22, 2025
జరిగిన సంఘటన పట్ల మంత్రులు ఉత్తమ్, జూపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలోని గాయపడిన క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ సూచించారు. మంత్రుల ఆదేశానుసారం సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు. లోపల చిక్కుకున్నారని భావిస్తున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచింది. మిగిలిన వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. సంఘటనా స్థలిలో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావులు పర్యవేక్షిస్తున్నారు.