Rythu Bharosa: రైతన్నలకు గుడ్ న్యూస్.. జనవరి 14 నుంచి రైతు భరోసా..!
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
- By Gopichand Published Date - 04:30 PM, Thu - 2 January 25

Rythu Bharosa: సీఎం రేవంత్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రూ. 2 లక్షల రుణమాఫీ పథకం విజయవంతంగా అమలుచేసిన కాంగ్రెస్ సర్కార్ రైతులకు మరో ప్రయోజనం చేకూరే పథకంపై వర్క్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు సంక్రాంతి కానుకను సిద్ధం చేసింది. రైతు భరోసా (Rythu Bharosa)పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం గురువారం మధ్యాాహ్నం ముగిసింది. ఈ భేటీలో సంబంధిత అధికారులతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రైతు భరోసాపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని చర్చించినట్లు సమాచారం.
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. రైతు భరోసాకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే రైతు భరోసా పరిమితిపై ఎటువంటి స్పష్టత రాలేదు.
Also Read: Talliki Vandanam Scheme : రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ – కేబినెట్ నిర్ణయం
రైతులకు సంక్రాంతికి కానుక ఇచ్చేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సంక్రాంతి రోజే రైతు భరోసా విడుదల చేసి రైతుల కళ్లలో ఆనందం చూడనుంది. ఇకపోతే రైతు భరోసా పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 15 వేలు సాయం అందించనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 10 వేలు అందించిన విషయం తెలిసిందే.