Terror Attack In J&K: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మరణం
సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 12:22 AM, Mon - 21 October 24

Terror Attack In J&K: జమ్మూకశ్మీర్‌లో విషాదకర ఘటన వెలుగుచూసింది. ఆదివారం గందర్‌బాల్‌లో ఉగ్రవాదులు కాల్పులు (Terror Attack In J&K) జరిపారు. ఉగ్రవాదుల దృశ్చర్యలో ఒక వైద్యుడు, ఐదుగురు నిర్మాణ సంస్థ ఉద్యోగులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. జెడ్ మోడ్ టన్నెల్ ప్రాజెక్ట్‌లో కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఈ ఉగ్రదాడి జరిగింది. దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశాయి.
సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది కార్మికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాల బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: Women’s T20 World Cup Final: మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టు విజేతగా న్యూజిలాండ్ జట్టు!
సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం తెలిపారు
ఉగ్రవాదుల కోసం భారత సైన్యం, పారామిలటరీ దళం, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నళిన్ ప్రభాత్‌తో సహా జమ్మూ కాశ్మీర్ పోలీసు డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనికి సంబంధించి సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సోనామార్గ్ ప్రాంతంలో వలస కార్మికులపై పిరికి దాడి గురించి చాలా విచారకరమైన వార్త ఉంది. నిరాయుధులైన అమాయకులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఉగ్రవాదుల దాడిలో ఈ వ్యక్తులు గాయపడ్డారు
ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు కూలీలు ఆస్పత్రిలో చేరగా, వారిలో పంజాబ్‌కు చెందిన గుర్మీత్ సింగ్ అప్పటికే మృతి చెందాడు. వీరిలో ఒక కార్మికుడు బీహార్‌కు చెందినవాడు కాగా, మిగిలిన ముగ్గురు కూలీలు స్థానికులు. అనంతరం క్షతగాత్రులందరినీ శ్రీనగర్‌కు తరలించారు.
- గుర్మీత్ సింగ్ (30) పంజాబ్ నివాసి
- బీహార్ నివాసి ఇందర్ యాదవ్ (35)
- కతువా నివాసి మోహన్ లాల్ (30)
- ఫయాజ్ అహ్మద్ లోన్ (26) ప్రెంగ్ కంగన్ నివాసి
- జగ్తార్ సింగ్ (30) కథువా నివాసి