HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >China Built A Large Military Base On Myanmar Coco Island

China-Myanmar :చైనా టార్గెట్ లో వైజాగ్, చెన్నై.. మయన్మార్ లో మిలిటరీ బేస్

China-Myanmar : మయన్మార్‌ ఆర్మీ చైనాతో చేతులు కలిపింది.మయన్మార్‌కు కుడివైపున బంగాళాఖాతంలో ఉన్న కోకో ద్వీపాన్ని చైనాకు అప్పగించింది. అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు డ్రాగన్ కు పర్మిషన్ ఇచ్చింది. 

  • Author : Pasha Date : 18-06-2023 - 1:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China Myanmar
China Myanmar

China-Myanmar : మయన్మార్‌ ఆర్మీ చైనాతో చేతులు కలిపింది.

మయన్మార్‌కు కుడివైపున బంగాళాఖాతంలో ఉన్న కోకో ద్వీపాన్ని చైనాకు అప్పగించింది. 

అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు డ్రాగన్ కు పర్మిషన్ ఇచ్చింది. 

దీనిపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఎందుకంటే కోకో ద్వీపం నుంచి భారత్ లోని చెన్నై, వైజాగ్, కోల్ కతా, బాలాసోర్ తీర ప్రాంతాలను చైనా ఈజీగా టార్గెట్ చేయగలుగుతుంది.

కోల్ కతా, చెన్నై, బాలాసోర్, వైజాగ్ లపై గురి 

చైనా లోన్ ట్రాప్ చాలా డేంజరస్ గా ఉంటుంది. మయన్మార్ కూడా ఇందులో ఇరుక్కుంది. 2021లో మయన్మార్ లో ఆర్మీ తిరుగుబాటు చేసి ఆంగ్ సాన్ సూకీని జైలులో వేసింది. సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఆధ్వర్యంలో మయన్మార్‌ లో సైనిక పాలన మొదలైంది.  దీన్ని పాశ్చాత్య దేశాలు వ్యతిరేకించాయి. మయన్మార్ ను(China-Myanmar) ఒంటరి చేశాయి. అయితే ఈ అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకుంది. మయన్మార్‌కు గత 2 ఏళ్లలో దాదాపు రూ.32వేల కోట్ల లోన్ ఇచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా  చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ బెల్ట్ రోడ్  కారిడార్ నిర్మాణానికి సహకరించాలనే షరతు పెట్టింది. భారత్ లోని  కోల్ కతా, చెన్నై, బాలాసోర్, వైజాగ్ తీర ప్రాంతాలకు చేరువగా ఉండే బంగాళాఖాతంలోని  కోకో ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసే ఛాన్స్ ఇవ్వమని  మయన్మార్‌  సైనిక పాలకులను చైనా కోరింది. ఇప్పటికే కోకో ద్వీపంలో విమాన సౌకర్యం కోసం చైనా రన్‌వే నిర్మించిందని ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది.  ఈ ద్వీపంలో దాదాపు 1500 మంది చైనా సైనిక సిబ్బంది కోసం కొత్త షెడ్‌లు, బ్యారక్‌లు నిర్మించారని సమాచారం.

Also read : China 41 Satellites : ఒకే రాకెట్ తో 41 శాటిలైట్ల ప్రయోగం.. చైనా మరో రికార్డ్

భారత్ ఆందోళనకు కారణాలు ఇవీ.. 

  • మయన్మార్ లోని కోకో ద్వీపంలో చైనా ఆర్మీ బేస్ ఏర్పాటుపై భారత్ ఆందోళన చెందుతోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే..
  • ఒడిశాలోని బాలాసోర్‌లో న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ ఫైరింగ్ రేంజ్, సాంప్రదాయిక క్షిపణి పరీక్షా ఫైరింగ్ రేంజ్ ఉన్నాయి. ఇది కోకో ద్వీపం ఉన్న అక్షాంశంలోనే ఉంది.
  • ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం కూడా.. సూటిగా  కోకో ద్వీపం ఉన్న అక్షాంశంలోనే ఉంది. దీంతో కోకో ద్వీపం నుంచి ఆ ప్రాంతంపై కూడా చైనా ఇంటెలీజెన్స్ కొనసాగొచ్చు.
  • విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న వ్యూహాత్మక సైనిక ఆస్తులపై కోకో ద్వీపం నుంచి  చైనా నిఘా పెట్టగలదు. అక్కడి నుంచి భారతదేశం యొక్క అణు జలాంతర్గాముల కదలికను చైనా పర్యవేక్షించే ఛాన్స్ ఉంది.
  • భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు కూడా విశాఖపట్నం తీరంలో ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో భారత సైన్యం కదలికలపై అదనపు ఇన్ పుట్స్ పొందేందుకు కోకో ద్వీపాన్ని ఒక వేదికగా చైనా వాడుకోనుంది.

కోకో ద్వీపం.. ఇండియా బార్డర్  

కోకో ద్వీపం అనేది బంగాళాఖాతంలో ఉన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది మయన్మార్ (బర్మా) అధికార పరిధిలో ఉంది. ఇది బంగాళాఖాతం, అండమాన్ సముద్రం సరిహద్దులో ఉంది. భారతదేశంలోని అండమాన్, నికోబార్ దీవులకు ఉత్తరాన ఇది ఉంది. పరిపాలనాపరంగా ఇది బర్మాలోని యాంగోన్ డివిజన్‌లో భాగం. కోకో ద్వీపం ఉత్తర అండమాన్ ద్వీపం నుంచి కేవలం 20 కి.మీలో దూరంలో ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balasore
  • bay of bengal
  • billions
  • bribed
  • china
  • China-Myanmar
  • Coco Island
  • india
  • large military base
  • myanmar
  • odisha
  • Visakhapatnam city

Related News

donald trump modi

డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

Donald Trump రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయన్న కారణంతో అమెరికా.. కొంత కాలంగా భారత్ సహా చైనా, బ్రెజిల్ వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఏకంగా 500 శాతం వరకు సుంకాల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లును

  • US control over Venezuela.. Trump's strategy as an oil hub

    వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

  • Mustafizur Rahman

    కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

  • No country has the right to act as an international judge: China expresses anger over Venezuela incident

    ఏ దేశానికి అంతర్జాతీయ జడ్జిగా వ్యవహరించే అర్హత లేదు: వెనెజువెలా ఘటన పై చైనా ఆగ్రహం

  • Maduro Arrest

    వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ , ఇండియాపై ఎఫెక్ట్ పడబోతుందా ?

Latest News

  • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

  • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd