HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >India Focusing On Weapons Capable Of Reaching Across China

Target China : చైనా నగరాలన్నీ టార్గెట్ గా భారత్ మిస్సైల్స్

Target China : సరిహద్దులలో చైనా ఓవర్ యాక్షన్ చేస్తోంది.  దీంతో దానికి చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలపై ఇండియా ఫోకస్ పెట్టింది. భవిష్యత్ లో చైనా తో యుద్ధమే వస్తే.. దాని నడ్డి విరిచే స్కెచ్ గీస్తోంది. 

  • Author : Pasha Date : 13-06-2023 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Target China
Target China

Target China : సరిహద్దులలో చైనా ఓవర్ యాక్షన్ చేస్తోంది.   

దీంతో దానికి చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలపై ఇండియా ఫోకస్ పెట్టింది.  

భవిష్యత్ లో చైనా తో యుద్ధమే వస్తే.. దాని నడ్డి విరిచే స్కెచ్ గీస్తోంది. 

యాక్షన్ చేస్తే .. రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు ఇండియా కూడా చైనా, పాకిస్తాన్ లకు రియాక్షన్ ఇస్తోంది. వాటి నుంచి పొంచి ఉన్న రిస్క్ దృష్ట్యా ఇండియా ఇప్పుడు అడ్వాన్స్డ్ మిస్సైల్స్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టింది. చైనాలోని ప్రధాన నగరాలన్నీ టార్గెట్ చేయగల (Target China) మిస్సైళ్ళ తయారీపై ఫోకస్ పెట్టింది. దీనిపై స్వీడన్‌కు చెందిన థింక్ ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) ఒక నివేదిక విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన సిప్రీ ఇయర్‌బుక్ 2023లో ఈ వివరాలను ప్రస్తావించారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన లాంగ్ రేంజ్ మిస్సైళ్ళను తయారు చేయాలని ఇండియా యోచిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ వద్ద 164 అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని తెలిపారు. ఈనేపథ్యంలో ఇండియా క్షిపణుల రేంజ్ పై ఒక లుక్ వేద్దాం..

1983లో ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలో.. 

1983లో క్షిపణుల రూపకల్పన కోసం Integrated Guided Missile Development Programme (IGMDP)ను ఇండియా ప్రారంభించింది. దీనికి ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. 2008లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. IGMDPలో భాగంగా ఆరు క్షిపణులను రూపొందించారు. అవి..  అగ్ని,  అస్త్ర,  పృథ్వి, ఆకాశ్,  త్రిశూల్, నాగ్.

Also read : Supersonic Brahmos: రూ.1700 కోట్ల భారీ డీల్.. త్వరలో సైన్యానికి డ్యూయల్ రోల్ “బ్రహ్మోస్” మిస్సైల్స్ !!

అగ్నిక్షిపణి సామర్ధ్యాలు.. (ఉపరితలం నుంచి ఉపరితలం)

  • అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి 700 నుంచి 1250 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.

  • అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి 2000 నుంచి 3000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.

  • అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి 3500 నుంచి 5000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.

  • అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి 3000 నుంచి 4000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.

  • అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి 5000 నుంచి 8000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు.

  • అగ్ని-6 బాలిస్టిక్ క్షిపణి 8000 నుంచి 10000 కి.మీ.ల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా అభివృద్ధి దశలో ఉంది.

Also read : Brahmos Missile : పాక్ పై భార‌త్ `మిస్సైల్ `క‌మామీషు

 ఇతర క్షిపణుల విశేషాలు 

• పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన మొదటి భారత క్షిపణి.. పృథ్వి

• జీపీఎస్ వ్యవస్థ గల తొలి క్షిపణి.. అగ్ని-2

• నాగ్.. యుద్ధ ట్యాంకుల విధ్వంసక క్షిపణి. దీని పరిధి 3-7 కి.మీ.లు

• హెలికాప్టర్ నుంచి ప్రయోగించే నాగ్ క్షిపణిని HELINA (Helicopter Launched NAG) అంటారు. ఇది 15 కేజీల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. దీనిని ఎలక్ట్రానిక్ డిటోనేటర్ సహాయంతో పేలుస్తారు.

• భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి.. సూర్య

• జలంతర్గామి నుంచి ప్రయోగించగల మొదటి భారతీయ క్షిపణి.. శౌర్యనిర్భయ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • across China
  • india
  • long range weapons
  • nuclear arsenal
  • nuclear delivery systems
  • Sipri report
  • Sweden
  • Target China
  • targets
  • think tank

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Balochistan has 'declared independence' from Pakistan.

    Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd