Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
- By Kavya Krishna Published Date - 02:15 PM, Sat - 31 May 25

Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు. “చరిత్ర మాసిపోదు.. చెరిపేయలేరు. డస్టర్ పెట్టి తుడిచినా, నిజాలు అదురుతాయ్,” అని స్పష్టంగా చెప్పారు. టీడీపీ కుచిత ఆలోచనలతో పని చేస్తోందని, ప్రజలను మభ్యపెట్టే డ్రామాలకే పరిమితం అవుతుందన్నారు. మహానాడు సభపై కూడా బొత్స సెటైర్లు వేశారు. “ఏమి చేశామో చెప్పలేకపోతే… బూటకపు కబుర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. పథకాలపై మాట్లాడలేరు. సూపర్ సిక్స్ గురించి స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం న్యాయమా?” అని నిలదీశారు.
Samantha : మళ్లీ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించుకోలేదు – సమంత
పదోతరగతి మార్కుల రీవెరిఫికేషన్‌కి 16,500 మంది అప్లై చేయడం అంత పెద్ద సంఖ్యలో ఇదే మొదటిసారి అని చెప్పారు. “మా హయాంలో ఐదువేలకంటే ఎక్కువగా రీవెరిఫికేషన్ వచ్చినట్లైతే చూపించండి. మీరు సమీక్ష ఏర్పాటు చేస్తే, ప్రతిపక్ష నేతగా హాజరవుతాను. దోషులపై చర్యలు తీసుకున్నారు? తీసుకోలేదా?” అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేగాక మహానాడు వేదికగా టీడీపీ నాయకులు ఉపయోగించిన భాషను ఖండిస్తున్నామని బొత్స స్పష్టం చేశారు.
Vemulawada : రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి..భక్తులు ఆగ్రహం